Begin typing your search above and press return to search.

దీపావళి బుకింగ్స్.. బుక్ మై షోలో టాప్ ఎవరు?

దీపావళి పండుగ జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో సినీ దీపావళిని మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

By:  M Prashanth   |   18 Oct 2025 12:34 PM IST
దీపావళి బుకింగ్స్.. బుక్ మై షోలో టాప్ ఎవరు?
X

దీపావళి పండుగ జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో సినీ దీపావళిని మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈసారి దివాళీకి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డ్యూడ్, తెలుసు కదా, కె- ర్యాంప్ చిత్రాలు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయ్యాయి.

వాటితోపాటు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతార ఇప్పటికే ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ సాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అలా ఇప్పుడు దీపావళి టైమ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు ఆయా సినిమాలు థియేటర్స్ లో ఉన్నాయి.

అయితే ఇప్పుడు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో సినీ ప్రియులు.. టికెట్లను తెగ బుక్ చేసుకుంటున్నారు. ఫెస్టివల్ తో పాటు లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో అంతా థియేటర్స్ లో వెళ్లి సినిమాలు చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో తాజాగా శుక్రవారం లెక్కలను వెల్లడించింది.

శుక్రవారం నాడు బుక్ మై షోలో అత్యధిక టికెట్లు సేల్ అయిన సినిమాగా కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ నిలిచింది. టాప్ ప్లేస్ ను సంపాదించుకుంది. ఆ మూవీకి నిన్న ఒక్కరోజే.. రెండు లక్షలకు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. 235.64K డ్యూడ్ మూవీ టికెట్స్ శుక్రవారం నాడు అమ్ముడైనట్లు బుక్ మై షో ప్లాట్ ఫామ్ తెలిపింది.

అయితే డ్యూడ్ తర్వాత స్థానంలో కాంతార చాప్టర్ 1 నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ.700 కోట్లకు పైగా వసూలు చేసిన మూవీ విడుదల అయ్యి 14 రోజులు దాటినా.. ఇంకా పెద్ద ఎత్తున ఆడియన్స్ థియేటర్స్ కు తరలివెళ్తున్నారు. ఇప్పుడు బుక్ మై షోలో శుక్రవారం నాడు 216.92k టికెట్స్ ను బుక్ చేసుకోవడం విశేషం.

డ్యూడ్, కాంతార చాప్టర్ 1 తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాకు 34 వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. వాటితోపాటు నేడు థియేటర్స్ లోకి వచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్ మూవీకి ప్రీ సేల్స్ లో భాగంగా 7 వేలకు పైగా టికెట్లు శుక్రవారం అమ్ముడయ్యాయి.