Begin typing your search above and press return to search.

అప్పుడు పెద్ద సినిమాలు.. ఇప్పుడు మీడియం చిత్రాలు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు రిలీజ్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   15 Oct 2025 9:19 AM IST
అప్పుడు పెద్ద సినిమాలు.. ఇప్పుడు మీడియం చిత్రాలు..
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు రిలీజ్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే. దాదాపు ప్రతి వారం కూడా నయా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అదే సంక్రాంతి సీజన్ లో అయితే చూడక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలు పోటీ పడతాయి. ఆడియన్స్ ముందుకు వచ్చి లక్ ను టెస్ట్ చేసుకుంటాయి.

అందుకు గాను ముందు నుంచే రిలీజ్ డేట్స్ కోసం కర్చీఫులు వేసుకుంటాయి. దీంతో దాదాపు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సీజన్ కు రావాలని చాలా సినిమాలు ఆరాటపడతాయి. ఆ నేపథ్యంలో ఇప్పటికే వచ్చే ఏడాది పొంగల్ సీజన్ కు గాను ఇప్పటికే పలు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. త్వరలో రిలీజ్ డేట్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న రాజా సాబ్ కూడా సందడి చేయనుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి జన నాయగన్ రిలీజ్ అవ్వనుంది. వీటితోపాటు అనగనగా ఒక రాజు మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ నాలుగు కన్ఫర్మ్ అవ్వగా.. మరో రెండు సినిమాలు యాడ్ అవ్వనున్నాయి. అయితే వాటిలో చాలా వరకు భారీ బడ్జెట్ చిత్రాలే. బడ్జెట్ పరంగా చూసుకుంటే సంక్రాంతి కానుకగా పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలే రిలీజ్ కావడం విశేషం. అదే సమయంలో ఇప్పుడు దీపావళికి కూడా పలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్నాయి.

నటుడు ప్రియదర్శి లీడ్ రోల్ లో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్‌ మిత్రమండలి మూవీ అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ.. అక్టోబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది. అదే రోజు కోలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్‌ విడుదల కానుంది.

ఆ తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కె- ర్యాంప్ మూవీ అక్టోబర్ 18వ తేదీన విడుదల కానుంది. ఈ నాలుగు సినిమాలు బడ్జెట్ పరంగా మీడియం రేంజ్ సినిమాలనే చెప్పాలి. దీంతో సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కానుండగా.. ఇప్పుడు దీపావళికి మీడియం రేంజ్ చిత్రాలు రానున్నాయన్నమాట.