అడ్వాన్స్ బుకింగ్స్ లో అంత బజ్ లేదా?
ఆ సినిమాలన్నింటి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలో కీలక పాత్ర పోషించాయి.
By: M Prashanth | 17 Oct 2025 4:45 PM ISTఅడ్వాన్స్ బుకింగ్స్.. ఏ సినిమా వసూళ్ల విషయంలోనైనా కీలక పాత్ర పోషిస్తాయి. ముందు నుంచి టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే.. సినిమా వసూళ్లు కచ్చితంగా పెరుగుతాయి. దీంతో ఏ మూవీకి అయినా మేకర్స్ రిలీజ్ కు కొద్ది రోజుల ముందు నుంచి ప్రీ సేల్స్ స్టార్ట్ చేస్తారు. ఓవర్సీస్ లో అయితే కొన్ని నెలల ముందే.
అయితే ఇప్పుడు దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సెప్టెంబర్ నెలతోపాటు దసరా కానుకగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లిటిల్ హార్ట్స్ , మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కాంతార చాప్టర్ 1 మూవీలు విడుదలయ్యాయి.
ఆ సినిమాలన్నింటి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలో కీలక పాత్ర పోషించాయి. కానీ ఇప్పుడు దీపావళి స్పెషల్ గా మిత్రమండలి మూవీ నిన్న రిలీజ్ అవ్వగా.. నేడు డ్యూడ్ తో పాటు తెలుసు కదా చిత్రాలు విడుదల అయ్యాయి. రేపు (అక్టోబర్ 18) వరల్డ్ వైడ్ గా కె- ర్యాంప్ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది.
అయితే మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు కె- ర్యాంప్ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ అబ్బవరం వినూత్నంగా సందడి చేశారు.
ప్రస్తుతం సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. కానీ ఇప్పుడు ప్రీ బుకింగ్స్ విషయం కోసం మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో బజ్ కనిపించడం లేదు. దీంతో ఏం జరుగుతుందోనని నెటిజన్లు, డిస్కస్ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల్లోనే అంత ఛేంజ్ ఎందుకు వచ్చిందోనని మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా వీకెండ్ తో పాటు దీపావళి హాలీడే కూడా ఈ సారి కలిసి వచ్చింది. అందుకే ఆయా చిత్రాల మేకర్స్.. ఇప్పుడు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.. చేశారు కూడా.. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా ఉండడం వెనుక కారణమేంటన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకు ఆడియన్స్ సైలెంట్ గా ఉన్నారో వారికే తెలియాలి.
అదే సమయంలో నేడు రిలీజ్ అయిన సినిమాల టాక్.. ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతోంది. కె- ర్యాంప్ కంటెంట్ పై మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. కాబట్టి టాక్ పాజిటివ్ గా బాగుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో జోష్ పెరిగే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పాలి. అప్పుడు వసూళ్లు కూడా బాగుంటాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
