Begin typing your search above and press return to search.

దీపావళి ఫైట్.. ఇంతకి ఏ సినిమా గెలిచింది?

దీపావళి ఫెస్టివల్ ను జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో దీపావళి కానుకగా ఈ ఏడాది నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

By:  M Prashanth   |   19 Oct 2025 12:11 PM IST
దీపావళి ఫైట్.. ఇంతకి ఏ సినిమా గెలిచింది?
X

దీపావళి ఫెస్టివల్ ను జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో దీపావళి కానుకగా ఈ ఏడాది నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మూడు స్ట్రెయిట్ మూవీస్ కాగా.. మరొకటి డబ్బింగ్ వెర్షన్. అవే మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కె-ర్యాంప్ చిత్రాలు.

అయితే అక్టోబర్ 16వ తేదీన ప్రియదర్శి మిత్రమండలి మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత రోజు డబ్బింగ్ మూవీ డ్యూడ్ తో పాటు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యాయి. నిన్న టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కె- ర్యాంప్ రిలీజైంది. మరి మూవీలన్ని ఎలా ఉన్నాయి? విన్నర్ ఏది?

ముందుగా దీపావళి రేసులో రంగంలోకి దిగింది మిత్రమండలి మూవీ. ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయగా.. అప్పటి నుంచి మిక్స్ డ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. జాతిరత్నాలు, మ్యాడ్, లిటిల్ హార్ట్స్ సినిమాల్లా మేకర్స్ ట్రై చేసినా.. సినిమాలో కాస్త నవ్వులు తగ్గాయి. దీంతో ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది.

ఆ తర్వాత ఒకే రోజు డ్యూడ్, తెలుసు కదా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తెలుసు కదా డిఫరెంట్ మూవీగా రూపొందిందనే చెప్పాలి. కొందరికి సినిమా అంతా కన్ఫ్యూజ్ గా అనిపించినా.. అర్థం కాకపోయినా.. మూవీలో కొన్నిచోట్ల డీప్ ఎమోషన్స్ ఉన్నాయి. అవి కనెక్ట్ అయితే మాత్రం సినిమా నచ్చుతుంది.

డ్యూడ్ విషయానికొస్తే.. కమర్షియల్ గా సక్సెస్ వచ్చిందనే చెప్పాలి. హీరో వరకు మాత్రం సినిమా అందరికీ నచ్చింది. యూత్ కు కూడా కనెక్ట్ అయింది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మెప్పించాయి. అయితే ప్రదీప్ రంగనాథన్ నటించిన గత సినిమాలు లవ్ టుడే, డ్రాగన్ కు వచ్చినంత రెస్పాన్స్.. ఇప్పుడు డ్యూడ్ కు రాలేదు!

చివరిగా.. భారీ అంచనాల మధ్య కె- ర్యాంప్ మూవీకి కూడా మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ బీ, సీ సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో మాస్ కామెడీ ఆ జోనర్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. కిరణ్ యాక్టింగ్ అందరినీ మెప్పిస్తోంది. దీంతో దీపావళి పండుగ కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన నాలుగు సినిమాల్లో విన్నర్ ఏది అనేది క్లియర్ గా చెప్పలేమేమో. ఒక్క మూవీపై అభిప్రాయాలు ఒక్కోలా ఉన్నాయి.