Begin typing your search above and press return to search.

సినీ 'దీపావళి'.. సౌత్ లో సందడి మాములుగా లేదుగా!

అనేక చిత్రాలు.. థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి వివిధ సినిమాలు విడుదల చేసేందుకు ఆయా చిత్రాల మేకర్స్ ఏర్పాట్లు చేశారు.

By:  M Prashanth   |   15 Oct 2025 6:00 PM IST
సినీ దీపావళి.. సౌత్ లో సందడి మాములుగా లేదుగా!
X

ఫెస్టివల్ వస్తే చాలు.. థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతాయి. దాదాపు ప్రతి పండుగకు కూడా మూవీలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఇప్పుడు దీపావళి వంతు వచ్చింది. అనేక చిత్రాలు.. థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి వివిధ సినిమాలు విడుదల చేసేందుకు ఆయా చిత్రాల మేకర్స్ ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో దీపావళి కానుకగా పెద్ద ఎత్తున సినిమాలు థియేటర్స్ లో విడుదల అవ్వనున్నాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్ సహా పలు జోనర్స్ లో రూపొందిన 13 చిత్రాలు పండుగ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాల మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్స్ ను కన్ఫర్మ్ చేసుకున్నారు. అనుకున్నట్లే రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ లో దీపావళి సందడి కామెడీ ఎంటర్టైనర్ మిత్రమండలి మూవీతో మొదలవుతుంది. అక్టోబరు 16వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ విడుదల అవ్వనుంది. అక్టోబర్ 18వ తేదీన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ చిత్రంతో రానున్నారు.

కోలీవుడ్ లో యంగ్ హీరో ప్రదీ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ.. అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ కానుంది. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జోనర్ లో రూపొందిన ఆ చిత్రం తెలుగులో కూడా విడుదల అవ్వనుంది. స్పోర్ట్స్ డ్రామా బైసన్ తో పాటు కామెడీ ఎంటర్టైనర్ కార్మెని సెల్వం, యాక్షన్ థ్రిల్లర్ కాంబి కట్న కథై రిలీజ్ అవ్వనున్నాయి. ఇవన్నీ తమిళ్ లో మాత్రమే.

అటు మాలీవుడ్ లో అనేక సొంత సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందరినీ ఆలోచింపజేసే జోనర్ లో థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ మూవీ విడుదల అవ్వనుంది. కంప్లీట్ క్రైమ్- కామెడీ అడ్వెంచర్ మూవీ ది పెట్ డిటెక్టివ్ విడుదల అవ్వనుంది. పాతిరాత్రి, ప్రేమిగల గమనక్కే కూడా మంచి అంచనాల మధ్య రిలీజ్ అవ్వనున్నాయి.

మొత్తమ్మీద దీపావళి కానుకగా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయన్నమాట. వాటికి పాజిటివ్ టాక్ వస్తే తిరుగుండదు. ఓ వారం పాటు థియేటర్స్ అన్నీ కళకళలాడనున్నాయి. ఆడియన్స్ తరలి వెళ్లనున్నారు. సినిమాలు చూసి ఎంజాయ్ చేయనున్నారు. తద్వారా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రానున్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.