బిగ్ బాస్9 తమిళ్ విజేతగా దివ్య గణేషన్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో దిగ్విజయంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 19 Jan 2026 10:35 AM ISTబిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో దిగ్విజయంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ బిగ్ బాస్ లో కనీసం ఒక్కసారైనా అమ్మాయిలు విజేతగా నిలుస్తారని ఎప్పుడూ ఆడియన్స్ అనుకుంటారు. కానీ అమ్మాయిలకు ఆ అవకాశం ఇవ్వరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈసారి తెలుగులో తనూజ టైటిల్ విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఓటింగ్ లో దూసుకొచ్చి కళ్యాణ్ పడాల ఆ టైటిల్ గెలుచుకున్నారు.కేవలం తెలుగు ఓటీటీ లో మాత్రమే బిందు మాధవి టైటిల్ విజేతగా నిలిచి చరిత్ర తిరగరాసింది. ఇక అప్పటినుంచి ఒక్కరు కూడా తెలుగులో అమ్మాయిలు విజేతగా నిలిచిన దాఖలాలు లేవు.
కానీ తమిళ్లో అలా కాదు.. ఇప్పటికే సీజన్ 2, సీజన్ 7లలో అమ్మాయిలు విజేతలుగా నిలిచారు. జనవరి 18వ తేదీన తమిళ్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈసారి కూడా అమ్మాయి విజేతగా నిలిచి అభిమానులను ఆకట్టుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి.. తన ఆట,మాట తీరుతో అందరి హృదయాలను దోచుకొని నేడు టైటిల్ విజేతగా నిలిచింది దివ్య గణేషన్. విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్ దిగ్విజయంగా పూర్తయింది. దీంతో దివ్య గణేషన్ టైటిల్ విజేతగా ట్రోఫీతో పాటు 50 లక్షలు ప్రైజ్ మనీని కూడా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్స్ ఆరాతీయడం మొదలుపెట్టారు.
దివ్య గణేషన్ విషయానికి వస్తే.. 1994 సెప్టెంబర్ 12న జన్మించిన ఈమె ప్రస్తుత వయసు 31 సంవత్సరాలు. తమిళనాడులోని రామనాథపురంలో పెరిగింది. బాల్యం నుంచే మోడలింగ్, నటనపై ఆసక్తి పెంచుకున్న ఈమె.. ఆ తర్వాత దానినే అభిరుచిగా మార్చుకొని, తన విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.
2015లో తమిళ్ సీరియల్ కేలడి కన్మణి సీరియల్ ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ఇక సీరియల్స్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ నటిగా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా విన్నైతాండి వరువాయా, లక్ష్మీ వందచు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఇందులో ప్రముఖ నటి వాణి భోజన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం గమనార్హం. 2019లో భాగ్యరేఖ అనే సీరియల్ తో తెలుగు టీవీ ప్రపంచంలోకి కూడా అడుగు పెట్టింది. అలాగే సుమంగళి, భాగ్యలక్ష్మి, చెల్లెమ్మ వంటి అనేక తమిళ్ సీరియల్స్ లో నటించి అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2017లో ప్రముఖ నటుడు నిర్మాత అయిన ఆర్కే సురేష్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇకప్పటినుంచి పెళ్లి అనే ఊసు ఎత్తలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి.. తన నాయకత్వ సామర్ధ్యాలతో అందరి హృదయాలను దోచుకుంది.
