Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్ లో వీధుల్లో విహరిస్తున్న దివ్యభారతి..

హీరోయిన్స్ తమ సినిమాల నుండి కాస్త విరామం దొరికిందంటే చాలు వెకేషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు.

By:  Madhu Reddy   |   19 Jan 2026 8:00 PM IST
మినీ స్కర్ట్ లో వీధుల్లో విహరిస్తున్న దివ్యభారతి..
X

హీరోయిన్స్ తమ సినిమాల నుండి కాస్త విరామం దొరికిందంటే చాలు వెకేషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడే ఎంజాయ్ చేస్తూ తమకు నచ్చిన ఫుడ్ తింటూ.. నచ్చిన వీధుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మిని స్కర్ట్ ధరించి అందాలతో ఆకట్టుకున్న దివ్యభారతి వీధుల్లో విహరిస్తూ స్వేచ్ఛా జీవితం అనుభవిస్తోంది.



ప్రముఖ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దివ్యభారతి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో మినీ స్కర్ట్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇక పొడువాటి జుట్టును ఫ్రీగా వదిలేసి.. వీధుల్లో విహరిస్తూ తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. ఇక వయ్యారంగా నడుచుకుంటూ వెళుతున్న తీరుకి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు కూడా షేర్ చేయడంతో దివ్యభారతి అందానికి అభిమానులు దాసోహం అవుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం దివ్య భారతి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.





1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూర్ లో జన్మించిన ఈమె.. ఇంజనీరింగ్ పట్టా అందుకుంది. 2015లో మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016లో న్యూ ఫేస్ మోడల్, క్రౌన్డ్ ప్రిన్సెస్ తో సహా ఎన్నో టైటిల్స్ ను సొంతం చేసుకుంది. ఇక 2021లో జీవి ప్రకాష్ కుమార్ సరసన బ్యాచిలర్ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు ఒకే సమయంలో దగ్గరయింది .ఈ చిత్రం విజయం సాధించడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. ఇక తర్వాత అంజన అలీ ఖాన్ దర్శకత్వంలో ముగెన్ సరసన రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ మదిల్ మేల్ కాదల్ అనే చిత్రంలో నటించింది అయితే ఈ సినిమా మలయాళం లో ఘనవిజయం అందుకున్న ఇష్క్ సినిమాకి తమిళ రీమేక్.





ఇక తెలుగులో ఈమె సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే మరొకవైపు తమిళంలో కతిర్ హీరోగా నటిస్తున్న ఆసై అనే సినిమాలో నటిస్తోంది. శివ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు పోస్టర్తో సహా ప్రకటించారు. ఈ పోస్టర్లో పగిలిన అద్దాలు పెట్టుకొని కతిర్ ఉండగా.. దివ్యభారతి అతని ముఖం మీద ఒక రకమైన భయంతో వాలి ఉన్నట్టు ఆ పోస్టర్లో చూపించారు. ఒక రహస్యంతో కూడిన ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ ని కూడా జోడించారు. రొమాన్స్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి రేవా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.