Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన దివ్వెల మాధురి!

బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాకముందు నుండి ఎన్నో రూమర్లు ఈ షో మీద వినిపించాయి. ఈ షోకి వెళ్లే వారిలో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి.

By:  Madhu Reddy   |   22 Sept 2025 5:48 PM IST
బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేయడంపై క్లారిటీ ఇచ్చిన దివ్వెల మాధురి!
X

బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాకముందు నుండి ఎన్నో రూమర్లు ఈ షో మీద వినిపించాయి. ఈ షోకి వెళ్లే వారిలో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. కానీ అందులో కొంతమంది మాత్రమే హౌస్ లోకి వెళ్లారు. వారందరిలో ప్రముఖంగా వినిపించిన పేరు దివ్వెల మాధురి. గత సంవత్సరం టెక్కలి నియోజకవర్గంలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్..వీరి వ్యవహారమే హాట్ టాపిక్.. టెక్కలి నియోజకవర్గం మొత్తం దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ల సంబంధం వైరల్ గా మారింది. అంతేకాదు దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య దువ్వాడ వాణి కూడా రంగంలోకి దిగి.. తన భర్తని తనకి ఇచ్చేయాలని మీడియా ముందు వాపోయింది.

అలాగే దువ్వాడ వాణి కూతుర్లు కూడా రంగంలోకి దిగారు.అలాగే తమ ఇంటి నుండి దివ్వెల మాధురి వెళ్లిపోవాలని చెప్పారు.కానీ ఎన్ని చేసినప్పటికీ దివ్వెల మాధురి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ని వదిలి పెట్టలేదు. అలా దువ్వాడ వాణి పక్కకు తప్పుకోవడంతో దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ లు ఇద్దరు ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. అయితే గత ఏడాది సెన్సేషనల్ అయిన దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుంది అని చాలా రోజుల నుండి రూమర్లు వినిపించాయి.అయితే ఆ రూమర్లకు తాజాగా తెర దించింది దివ్వెల మాధురి..

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నిజంగానే నాకు బిగ్ బాస్ సీజన్ 9లో ఆఫర్ వచ్చింది.కానీ అన్ని రోజులపాటు నా రాజాని వదిలి ఉండడం ఇష్టం లేకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ ని రిజెక్ట్ చేశాను.. నేను ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నా రాజా తోనే ఎక్కువగా గడుపుతాను. వంట చేయడం,అతనికి ప్రేమగా తినిపించడం, అతనితో సమయం గడపడమే నాకు ఇష్టం.. అన్ని రోజులు అతన్ని వదిలి నేను ఉండలేను. చాలా పర్సనల్ కారణాల వల్లే నేను బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్లడానికి నో చెప్పాను. నేను తరచూ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాను.కొన్ని రోజులు రాజకీయ ప్రయాణాలు,మరికొన్ని రోజులు మనసు ప్రశాంతత కోసం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అలా సమయం దొరికితే చాలు ఇష్టమైన ప్లేస్ లను పర్యటిస్తాం".. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది దివ్వెల మాధురి..

లేటు వయసులో ప్రేమలో పడ్డ దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ లకు సంబంధించి ఈ విషయం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక రీసెంట్ గా వీరిద్దరూ కలిసి ఓ సారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. అలా అటు రాజకీయాల్లో ఇటు వ్యక్తిగత జీవితంలో మరోవైపు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే దివ్వెల మాధురి బిగ్ బాస్ లోకి వస్తే బాగుండని ఎంతోమంది అనుకున్నారు.గతంలో దివ్వెల మాధురి చేసే రీల్స్ చాలా వైరల్ అవ్వడంతో అవి బిగ్ బాస్ యాజమాన్యం దృష్టిని ఆకర్షించాయి. అలాగే గత ఏడాది జరిగిన గొడవల కారణంగా దివ్వెల మాధురికి మంచి ఆదరణ రావడంతో ఆమెను హౌస్ లోకి తీసుకువస్తే బాగుంటుందని బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్నారు. కానీ దివ్వెల మాధూరి మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలిపింది.