Begin typing your search above and press return to search.

నా రాజాను చూసుకోవడానికి నేను తప్ప మరెవరూ లేరు

దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. అయితే ఆ పాపులారిటీ ఇప్పుడు రెట్టింపు అయిందని చెప్పవచ్చు.

By:  Madhu Reddy   |   5 Nov 2025 6:22 PM IST
నా రాజాను చూసుకోవడానికి నేను తప్ప మరెవరూ లేరు
X

దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. అయితే ఆ పాపులారిటీ ఇప్పుడు రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇందులో దివ్వెల మాధురి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టింది. లేడీ ఫైర్ బ్రాండ్ గా వచ్చిన ఈమె నాగార్జున సలహా సూచనల మేరకు తన ఆట తీరుతో, మాట తీరుతో అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా టాప్ 5కి వెళ్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా.. దివ్వెల మాధురిని కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తూ భరణి శంకర్ తో లేనిపోని రిలేషన్ అంట గడుతూ చేసిన కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది దివ్వెల మాధురి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న మాధురి మాట్లాడుతూ.. "నన్ను ఎవరైతే భరణితో కలిసి నీచాతి నీచంగా ట్రోల్స్ చేశారో.. వారు అసలు అమ్మకే పుట్టలేదు.. నా దృష్టిలో వాడు మనిషే కాదు. అసలు వాడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆరోజు పండగలో భాగంగా భరణి గారితో నేను కనిపించేసరికి లేనిపోని ట్రోల్స్ చేస్తూ..నానా రచ్చ చేస్తున్నారు" అంటూ మండిపడింది. వెంటనే పక్కనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ... "మాధురి ఏంటో నాకు తెలుసు.. నేను ఏంటో మాధురికి తెలుసు.. ఎవరేమనుకున్నా మాకు ఎటువంటి బాధ లేదు" అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.

అలాగే తన కన్న బిడ్డల గురించి మాట్లాడుతూ.. "నా బిడ్డను చూసుకోవడానికి మా అమ్మ, నాన్న, మా చెల్లి ఇలా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. నా కన్నబిడ్డలను చూసుకోవడం విషయంలో నాకు ఎటువంటి భయం లేదు.కానీ నా రాజాను చూసుకోవడానికి నేను తప్ప మరెవరూ లేరు. నా పిల్లాడి కంటే పిల్లాడు.". అంటూ దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ పై ప్రేమ కురిపించింది. ఇది చూసిన యాంకర్ కూడా ఆశ్చర్యపోయారు.

ఇకపోతే రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడుతూ.. విస్తుపోయే నిజాలు బయట పెట్టింది మాధురి. సెలబ్రిటీల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ మాధురికి ఇచ్చారని.. మొత్తం తొమ్మిది లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారు అంటూ వార్తలు రాగా .. వీటిపై మాధురి మాట్లాడుతూ.. హౌస్ నుంచీ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఆ డబ్బు అవసరం లేదని శ్రీనివాస్ చెప్పాడు. అందుకే నేను తీసుకోలేదు. అలాగే మేము ఇద్దరం కలిసి ఒక సినిమాలో కూడా నటించాము. అప్పుడు కూడా డబ్బు తీసుకోకుండా ఫ్రీగానే నటించాం.. అంటూ తమకు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చింది మాధురి. ప్రస్తుతం మాధురి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.