అన్న తీట చూసి చెల్లికి బుర్రపాడు!
బుల్లితెర మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అయ్యారో తెలిసిందే. బుల్లి తెరపై చెరగని ముద్ర వేసిన నటుడు.
By: Srikanth Kontham | 27 Jun 2026 9:00 PM ISTబుల్లితెర మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అయ్యారో తెలిసిందే. బుల్లి తెరపై చెరగని ముద్ర వేసిన నటుడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తనయుడు చంద్ర హాస్ కూడా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తనయుడు బుల్లి తెరకు కాకుండా నేరుగా సినిమా తెరకే పరిచయమయ్యాడు. 'రామ్ నగర్ బన్నీ', 'బరాబర్ ప్రేమిస్తా' ఇలా రెండు సినిమాలు చేసాడు. ఆ రెండింటి తర్వాత మళ్లీ కొత్త సినిమా అప్డేట్ లేదు. అయితే సినిమాలు చేసే క్రమంలో చంద్రహాస్ యాటిట్యూడ్ తో నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కున్నాడు. అదంతా పక్కన బెడితే తాజాగా చంద్రహాస్ చిన్ననాటి అల్లరి గురించి సోదరి దివిజ ప్రభాకర్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నయ్య చిన్నతనంలో చేసిన వింత అల్లరి పనిని గుర్తు చేసుకుంటూ ఆ తీట చూసి తనకు బుర్రపాడైపోయిందని సరదాగా వ్యాఖ్యానించింది. `చంద్రహాస్ చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఇంట్లో ఉంటే అంతా అల్లరిగానే ఉంటుంది. సాధారణంగా అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య చిన్నప్పుడు గొడవలు, ఆటపట్టించుకోవడాలు సహజమే అయినప్పటికీ.. చంద్రహాస్ చేసే పనులు కాస్త భిన్నంగా, ఊహించని విధంగా ఉండేవని గుర్తు చేసుకుంది.
ఆ అల్లరి చేష్టలు ఒక్కోసారి భరించడం కష్టంగా ఉన్నా? ఇప్పుడు తలుచుకుంటే నవ్వు తెప్పిస్తాయని అంది. ముఖ్యంగా స్కూల్ రోజుల్లో బస్సు ప్రయాణంలో జరిగిన వింత సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించింది. చిన్నప్పుడు స్కూల్ బస్సులో వెళ్తున్న సమయంలో చంద్రహాస్ తనను సీట్లో ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా.. కిందపడేసి, పైకిలేపేసి బస్సులోనే కుదిపేసేవాడని సరదాగా ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు ముక్కు నుంచి రక్తం కారినా లైట్ తీసుకున్నాడంది. అన్నయ్య చేసిన ఆ వింత చేష్టలకు, అతనిలోని ఆ అల్లరి తీట కు బస్సులో అందరి ముందు తనకు ఏం చేయాలో? పాలుపోక బుర్రపా డైపోయేదని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
సెలబ్రిటీల పిల్లలు అనగానే పద్ధతిగా, సైలెంట్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ తమ ఇంట్లో మాత్రం సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అన్నదమ్ముల గొడవలే ఉండేవని ఈ విషయాల ద్వారా స్పష్టమవుతోంది. చంద్రహాస్ చిన్నప్పటి ఆ అల్లరి కోణాన్ని అతని చెల్లెలు బయటపెట్టడంతో ప్రభాకర్ ఫ్యామిలీలోని బాండింగ్ - వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దివిజ కూడా యాక్టింగ్ లో రాణించే ప్రయత్నాలు చేస్తోంది. వెనుక తండ్రి సహకారం ఉండటంతో పిల్లలిద్దరు నటనా రంగంలో స్థిరపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
