మొత్తం అంతా నువ్వే అంటున్న దివి.. ఏంటి సంగతులు బేబీ!
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మెరూన్ రెడ్ కలర్ టాప్ డెనిమ్ జీన్స్ ధరించిన ఈమె నడుము అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
By: Madhu Reddy | 28 Jan 2026 11:16 AM ISTఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ ప్రత్యేకించి సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ.. ఫాలోవర్స్ ను పెంచుకోవడం అటు ఉంచితే.. ఇటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను క్యాప్షన్ రూపంలో హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నిజానికి తమ అందంతో అభిమానులను ఆకట్టుకోవడం ఒక ఎత్తైతే.. ఆ అభిమానులను సంపాదించుకోవడం మరో ఎత్తు.. ఇక పాపులారిటీ కోసం హీరోయిన్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు.. రోజుకొక ఫోటోషూట్ తో నిత్యం అభిమానులను అలరించడానికి కష్టపడిపోతున్నారు అనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా ఆడియన్స్ లో పాపులారిటీ దక్కించుకొని.. అటు దర్శక నిర్మాతల కంట్లో పడి.. సరైన సక్సెస్ లభిస్తే కెరియర్ను మార్చుకోవాలని చూసే అమ్మాయిలు ఎంతోమంది.. ఇక అలాంటి అందగత్తెలలో దివి కూడా ఒకరు. తన అందంతో అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ.. ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించగలను అని నిరూపిస్తున్న ఈ లేడి తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులలో సరికొత్త అనుమానాలు కలిగిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మెరూన్ రెడ్ కలర్ టాప్ డెనిమ్ జీన్స్ ధరించిన ఈమె నడుము అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
కొన్ని ఫోటోలలో ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఫోటోలు షేర్ చేసిన ఈమె.. మరికొన్నింటిలో ఒళ్ళు విరుస్తూ వయ్యారంగా ఉన్న ఫోటోలు పంచుకుంది. ఇందులో కాటుక కళ్ళతో కుర్రకారును మాయ చేస్తూ అభిమానుల గుండెల్లో గుణపాలు దింపుతోంది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఒక రకంగా చెప్పాలి అంటే దివి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు మల్లి నీతో పాటు పెరిగి.. నీతో గడిపిన క్షణాలను మధురంగా మార్చుకోవాలని చూస్తున్నాను.. దీనికి నువ్వు ఒప్పుకుంటావా సఖి అంటూ ఒక అభిమాని ఏకంగా కామెంట్ పెట్టేశారు. ఇంకొకరేమో పాలరాతి శిల్పం అని , క్యూట్ అంటూ ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. దివి తన గ్లామర్ ఫోటోలను పంచుకోవడమే కాకుండా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా "మొత్తం అంతా నువ్వే మరి" అంటూ ఒక లవ్ ఎమోజిని షేర్ చేసింది. ఇది చూసిన నెటజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంపతీసి లవ్లో పడిపోయావా అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది ఏమో ఎవరితోనైనా డేటింగ్ లో ఉందేమో అందుకే ఇలాంటి క్యాప్షన్ జోడించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటి బేబీ సంగతులు.. ఇలాంటి క్యాప్షన్ ఇచ్చావు అంటూ అడుగుతున్నారు. ఏది ఏమైనా దివి పెట్టిన ఈ ఒక్క పోస్టు ఇప్పుడు ఈమెను వార్తల్లో నిలిచేలా చేసింది అనడంలో సందేహం లేదు.
