Begin typing your search above and press return to search.

బికినీ.. బోల్డ్ సీన్స్.. అసలు విషయం చెప్పిన దివి!

పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమాలో దివి లీడ్ రోల్ పోషించగా.. టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర హీరోగా నటించారు.

By:  M Prashanth   |   4 Feb 2026 10:38 AM IST
బికినీ.. బోల్డ్ సీన్స్.. అసలు విషయం చెప్పిన దివి!
X

తెలుగు అందం దివి వద్త్యా గురించి అందరికీ తెలిసిందే. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ సంపాదించుకున్న అమ్మడు.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తున్నారు. సూపర్ ఛాన్స్ లు అందుకుని బిజీ బిజీగా గడుపుతున్న దివి.. థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఇప్పుడు హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ హానీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమాలో దివి లీడ్ రోల్ పోషించగా.. టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర హీరోగా నటించారు. సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర ముఖ్య పాత్రలో నటించగా.. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి రూపొందించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న హనీ మూవీని ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దివి కొన్ని బో*ల్డ్ సీన్స్ లో కనపడడం.. ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. ఎందుకంటే.. నెట్టింట అప్పుడప్పుడు హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేసే అమ్మడు.. హనీ మూవీలో బో*ల్డ్ సన్నివేశాల్లో కనపడనుందని ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది.

అదే విషయాన్ని దివి ముందు ప్రస్తావించారు ఓ మీడియా ప్రతినిధి. "బికినీ పిక్స్ ఇండియా వైడ్ గా వైరల్ అయ్యాయి.. సోషల్ మీడియాను ఊపేశాయి.. డిలీట్ చేసినా ట్రెండింగ్ లో ఉన్నాయి.. హనీ మూవీలో బో*ల్డ్ సీన్స్ లో కనిపించారు. దానికి కారణం కంటెంటా.. రెమ్యూనరేషనా" అని అడగ్గా.. ముందు దివి చిన్న స్మైల్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా చేయడానికి రీజన్ కాన్సెప్ట్ అని తెలిపారు. కరుణ కుమార్ తో వర్క్ చేయాలనుకునే ప్రాజెక్టుకు ఓకే చెప్పానన్నారు.

అదే సమయంలో రెమ్యూనరేషన్ వైజ్ గా తాను సంతోషంగా ఉన్నానన్న దివి.. నిర్మాత సాలిడ్ పారితోషికం ఇచ్చారని చెప్పారు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని, అంతే కాదు రవి డైరెక్షన్ లో తాను ఓ సినిమా చేస్తున్నట్లు రివీల్ చేశారు తెలిపారు. అయితే హనీ మూవీని మాత్రం తాను కాన్సెప్ట్ ను విని.. ఆలోచించి నచ్చాకనే ఓకే చేశానని చెప్పిన అమ్మడు.. మూవీ అదరగొట్టే సీన్స్, షాట్స్ ఉన్నాయని వెల్లడించారు.

"సినిమాలో నవీన్ గారు, దివ్య, రాజా రవీంద్ర గారు ఇలా అందరూ ఒకరికి మించి ఒకరు పర్ఫామెన్స్ ఇచ్చే నటుల మధ్య యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆడియన్స్ అందరినీ వెంటాడే సినిమా అవుతుంది (నవ్వుతూ) అందరూ ఫిబ్రవరి 6న థియేటర్‌ కు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నా" అంటూ దివి తెలిపారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.