Begin typing your search above and press return to search.

ఒక ఆడదానిలా ఉండకూడదు.. సమాజపు కట్టుబాట్లపై దివి వద్యత!

టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన బో*ల్డ్ అండ్ ఇండిపెండెంట్ విమెన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వద్యత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   8 Oct 2026 9:13 AM IST
ఒక ఆడదానిలా ఉండకూడదు.. సమాజపు కట్టుబాట్లపై దివి వద్యత!
X

టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన బో*ల్డ్ అండ్ ఇండిపెండెంట్ విమెన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వద్యత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను షేర్ చేసారు. ప్రముఖ నటుడు రాజా రవీంద్రతో జరిగిన ఈ ఆసక్తికర సంభాషణలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం.. సమాజంలో మహిళలపై ఉండే మూస పద్ధతుల గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో దివి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా `ఒక ఆడదానిలా ఉండకూడదు` అంటూ దివి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైర‌ల్ గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దివి స్పందిస్తూ సమాజం అమ్మాయిల మీద కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు రుద్దాలని చూస్తుంటుందని తెలిపారు. అమ్మాయిలు ఇలాగే ప్రవర్తించాలనే మూస పద్ధతులను తాను ఎప్పుడూ నమ్మలేదన్నారు. చిన్నప్పటి నుంచి ఎవరికీ భయపడకుండా.. ధైర్యంగా తనకంటూ ఒక స్టాండ్‌తో స్వతంత్రంగా పెరిగానని చెప్పారు. ఇతరుల అంచనాలకు లేదా హద్దులకు తగ్గట్టుగా బతకడం కంటే.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇక తన మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమ వరకు సాగిన ప్రయాణం గురించి చెబుతూ.. ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నదో వివరించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తాను ఎంతగానో కష్టపడ్డానని చెప్పారు. ముఖ్యంగా `బిగ్ బాస్` రియాలిటీ షో తన కెరీర్‌కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని ఆ షో ద్వారానే తెలుగు ప్రేక్షకుల దగ్గరకు మరింత చేరువయ్యానని దివి సంతోషంగా గుర్తుచేసుకున్నారు.

రాజా రవీంద్ర అడిగిన పలు సరదా .. బోల్డ్ ప్రశ్నలకు దివి ఎక్కడా తడబడకుండా స్పష్టమైన అభిప్రాయాలతో సమాధానాలు ఇచ్చారు. జీవితాన్ని చూసే విధానం, నటనపై తనకున్న అభిరుచిని ఈ ఇంటర్వ్యూ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు పూర్తి ఆస్కారం ఉన్న వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తన బలమైన ఆసక్తిని ఈ సందర్భంగా వెల్లడించారు.

మొత్తానికి ఇతరుల మాటలను లెక్కచేయకుండా తన స్వశక్తితో ఎదుగుతూ.. సమాజంలో మహిళలు తమ స్వయంప్రతిపత్తిని చాటాలనే సందేశాన్ని దివి వద్యత ఈ ఇంటర్వ్యూ ద్వారా అందించారు. ఒక నటిగా తన ప్రయాణాన్ని వివరిస్తూనే... నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా దివి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.