చీరకట్టులో దివి అందాలు చూడతరమా?
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దివి తాజాగా మరోసారి చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచేసింది.
By: Madhu Reddy | 5 Feb 2026 12:00 PM ISTఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో దివి కూడా ఒకరు. 2019లో వచ్చిన మహేష్ బాబు 'మహర్షి' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ సినిమాలో నటిగా పెద్దగా గుర్తింపు రాకపోయినా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. 2020లో హైదరాబాద్ టైమ్స్ టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దివి తాజాగా మరోసారి చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచేసింది. నడుము అందాలను చూపిస్తూ తన గ్లామర్ తో హైలెట్గా నిలిచింది .చక్కగా జుట్టును ముడి వేసుకొని.. స్టోన్ తో డిజైన్ చేసిన చెవి దుద్దులు పెట్టుకున్న ఈమె.. మెడను సింపుల్ చైన్ తో ఫుల్ ఫీల్ చేసింది. ఇక ఎర్రటి గాజులు ధరించి మరింత అందంగా ముస్తాబయింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే చూడ చక్కని బొమ్మలా అందరి దృష్టిని ఆకర్షించింది దివి అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఇలా సింపుల్ లుక్ లో చీర కట్టులో కూడా అందరి హృదయాలు దోచుకుంది దివి.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి4 తన కెరియర్ లో జరిగిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. అలాగే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వ్యక్తిగత స్వేచ్ఛ , సమాజంలో మహిళల పట్ల అవగాహన గురించి లోతైన చర్చను ప్రారంభించింది . అందులో భాగంగానే ఒక పబ్ ఈవెంట్ కి అతిధిగా వెళ్ళినప్పుడు ఎదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. దివి మాట్లాడుతూ.." ఇటీవల ఒక పబ్ ఈవెంట్ కి అతిథిగా వెళ్లాను. చుట్టూ బాడీగార్డ్లు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి నా నడుముకి గిల్లాడు. ఆ సంఘటన జరిగిన వెంటనే వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.
అయితే ఈ చర్య పట్ల నాకు ఏమాత్రం పశ్చాతాపం లేదు. ఒకవేళ నేను అలా స్పందించకపోతే భవిష్యత్తులో బాధపడేదాన్నేమో.. నా చుట్టూ భద్రత ఉన్నప్పటికీ ఈ సంఘటన జరిగింది.. అయితే ఇది నా దుస్తుల వల్ల జరగలేదు" అంటూ నొక్కి మరీ చెప్పింది దివి.. సౌకర్యవంతమైన టీ షర్టు ధరించినప్పటికీ ఒక ఆకతాయి ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే చర్యకు ప్రతిచర్య జరిగింది అంటూ చెప్పుకొచ్చింది..ప్రస్తుతం దివి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా మహిళల వస్త్రధారణ పై కామెంట్లు వస్తున్న నేపథ్యంలో తాను సభ్యతగా ఉన్నప్పటికీ ఇతరుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది.
