అందం కాదు.. ఇది పవర్ఫుల్ గ్లామర్
బిగ్ బాస్ షోతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన బ్యూటీ దివి వాద్త్యా. తన క్యూట్ లుక్స్, హైట్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.
By: M Prashanth | 15 Jun 2026 10:56 AM ISTబిగ్ బాస్ షోతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన బ్యూటీ దివి వాద్త్యా. తన క్యూట్ లుక్స్, హైట్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట క్రేజీగా ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలో దివి బ్లాక్ స్పోర్ట్స్ బ్రా, పింక్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని పక్కా జిమ్ ఫ్రీక్ లా కనిపిస్తోంది.
ఇక్కడ జనాలను ఎట్రాక్ట్ చేసేది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కాదు, ఆమె మెయింటైన్ చేస్తున్న సాలిడ్ ఫిట్నెస్. కఠినమైన వర్కౌట్స్ చేసిన తర్వాత తీసిన పోస్ట్ వర్కౌట్ పిక్ లా ఇది అనిపిస్తోంది. ఆమె నడుము భాగంలో స్పష్టంగా కనిపిస్తున్న యాబ్స్ చూస్తే ఫిట్నెస్ కోసం ఆమె ఎంతలా డెడికేట్ అయిందో ఇట్టే అర్థమవుతుంది.
మామూలుగా హీరోయిన్లు అనగానే గ్లామర్ షో చేయడానికి కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ దివి మాత్రం తన గ్లామర్ కంటే ఫిట్నెస్ కే ఎక్కువ ఓటు వేస్తున్నట్లు ఈ లుక్ ప్రూవ్ చేస్తోంది.
ఊరికే స్కిన్ షో చేయడం వేరు, ఇలా కష్టపడి బాడీని టోన్డ్ గా మార్చుకోవడం వేరు. రెగ్యులర్ జిమ్ సెషన్స్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లాంటివి పర్ఫెక్ట్ గా చేస్తే తప్ప ఇలాంటి రిజల్ట్ బయటకు రాదు. ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేకుండా వర్కౌట్ తర్వాత వచ్చిన చెమటతో చాలా రా అండ్ నేచురల్ వైబ్స్ ఇస్తోంది. ఆమె ఎక్స్ ప్రెషన్ లో కూడా ఆ ఇంటెన్సిటీ క్లియర్ గా తెలుస్తోంది. ఫిట్నెస్ లవర్స్ కు ఈ ఫోటో ఒక బెస్ట్ మోటివేషన్ లాంటిది అని చెప్పొచ్చు.
తన బాడీని ఇంత పర్ఫెక్ట్ గా ఉంచుకోవడం వెనుక ఆమె రోజూ పడే శ్రమ ఈ లుక్ లో కనిపిస్తోంది. కెరీర్ పరంగా చూసుకుంటే దివి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటోంది. ఇలాంటి స్ట్రాంగ్ ఫిజిక్ మెయింటైన్ చేయడం వల్ల గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసే ఛాన్స్ కూడా ఆమెకు దక్కుతుంది. ఒక నటిగా తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడంలో దివి తీసుకుంటున్న కేర్ ఈ ఫోటోలో స్పెషల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫిట్నెస్ ఫోటో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది. గ్లామర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఆమె యాబ్స్ చూసి నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
