Begin typing your search above and press return to search.

ఎడారిలో దివి అందాలు.. చీరకట్టులో మెస్మరైజ్ చేస్తూ..

ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో ఆమె ధరించిన చీర ఆమె వొంపుసొంపులు ఫోటోలకు మరింత గ్లామర్‌ను తెచ్చిపెట్టాయి.

By:  Madhu Reddy   |   25 Jan 2026 3:51 PM IST
ఎడారిలో దివి అందాలు.. చీరకట్టులో మెస్మరైజ్ చేస్తూ..
X

తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వధ్యా.. 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దివి బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మోడ్రన్ దుస్తుల్లో కనిపించే దివి, ఈసారి సాంప్రదాయ చీరకట్టులో ఎడారిలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎర్రటి ఎండలో, బంగారు వర్ణపు ఇసుక తిన్నెల మధ్య ఆమె సోయగం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అతి తక్కువ సమయంలో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న నటీమణుల్లో దివి ఒకరు . మండుతున్న ఎండలో కూడా తన చిరునవ్వుతో వాతావరణాన్ని చల్లబరుస్తోందంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా అందరికి పరిచయం అయిన దివి, కేవలం నటనతోనే కాదు తన డ్రెస్సింగ్ సెన్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ లో 49 రోజులపాటు ఉండి ఎలిమినేట్ అయింది. అటు అందం, ఇటు నటన రెండూ ఉన్నప్పటికీ సరైన మూవీ దొరకక.. సినిమాల్లో ఇప్పటివరకు మంచి పాత్రలు దొరకక, సైడ్ క్యారెక్టర్లకే పరిమితమైనది. ప్రస్తుతం మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇక కొన్ని చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతోంది.

ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో ఆమె ధరించిన చీర ఆమె వొంపుసొంపులు ఫోటోలకు మరింత గ్లామర్‌ను తెచ్చిపెట్టాయి. ఎడారి గాలులకు ఎగురుతున్న కొంగు, తీక్షణమైన చూపులతో ఆమె ఇస్తున్న ఫోజులకు కుర్రకారు కవితలు కడుతున్నారు. ఒక పిక్ లో ఆమె గ్లాస్సెస్ ఆమె అందాన్ని మరింత పెంచేశాయి. ఒకవైపు గ్లామర్‌ను ప్రదర్శిస్తూనే, మరోవైపు భారతీయ నారిగా చీరలో ఉన్న హోయలు ఆమెకే చెల్లాయి.

దివి ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చి చేరాయి. "ఎడారిలో మెరుస్తున్న మెరుపు తీగ" అని కొందరు, "చీరకట్టులో దివి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు" అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. నటిగా ఎదగడమే కాకుండా, మోడలింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్న దివి, ఇలాంటి వినూత్నమైన ఫోటోషూట్‌లతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఫాలోవర్స్ కోసం ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటోలను అందిస్తూ సోషల్ మీడియా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది.గ్లామర్ మరియు ట్రెడిషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో దివి రూటే వేరు. .