నెట్టింట హీట్ పెంచుతున్న దివి.. స్టన్నింగ్ లుక్స్
జబ్ తుమ్ సాత్ హో అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దివి ఎక్స్ ప్రెషన్స్ కు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.
By: M Prashanth | 23 Jun 2026 11:59 PM ISTసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె గ్లామర్ డోస్ కాస్త పెంచినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఒక అందమైన సెటప్ లో క్రీమ్ కలర్ డిజైనర్ టాప్, దానికి సెట్ అయ్యేలా స్కర్ట్ ధరించి కెమెరాకు ఇచ్చిన పోజులు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. లైట్ మేకప్ తో చాలా న్యాచురల్ గా కనిపిస్తూనే తనలోని గ్లామరస్ యాంగిల్ ను హైలెట్ చేసింది.
జబ్ తుమ్ సాత్ హో అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దివి ఎక్స్ ప్రెషన్స్ కు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఈ అవుట్ ఫిట్ లో ఆమె లుక్ మరింత ఎలివేట్ అయింది. ఒకపక్క ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే మరోపక్క మోడ్రన్ గ్లామర్ ను బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరీ ఓవర్ గా కాకుండా చాలా డీసెంట్ గా తన గ్లామర్ ను ప్రెజెంట్ చేసిన విధానం ఫాలోవర్స్ కు బాగా నచ్చుతోంది.
దివి కెరీర్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ షో ఆమెకు ఎంత క్రేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రియాలిటీ షోలో పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా ఉంటూనే తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అప్పటివరకు మోడలింగ్ లో ఉన్న దివికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇండస్ట్రీలో మంచి అవకాశాలే దక్కాయి. మంచి హైట్, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండటంతో ఫిల్మ్ మేకర్స్ ఆమెకు ఆఫర్స్ ఇస్తూ వచ్చారు.
సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో కూడా దివి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కొన్ని వెబ్ సిరీస్ లలో ముఖ్య పాత్రలు పోషించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ లో ఒక మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలనే టార్గెట్ తో అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇక పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ వచ్చినా వాటిని వదులుకోకుండా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది.
ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో ఉండాలంటే యాక్టింగ్ తో పాటు గ్లామర్ మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం. బహుశా అందుకే దివి ఇలాంటి ఫోటోషూట్స్ తో మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్లాన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. సరైన బ్రేక్ వస్తే కమర్షియల్ సినిమాల్లో కూడా గ్లామర్ రోల్స్ చేయడానికి తను రెడీ అనే సిగ్నల్స్ ఈ వీడియో ద్వారా పంపుతోందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ గ్లామర్ షో ఆమె కెరీర్ కు ఫ్యూచర్ లో ఎంతవరకు ప్లస్ అవుతుందో.
