దీపావళి మెరుపులో.. చూపు తిప్పుకోనివ్వని దివి
గోల్డెన్ కలర్ లెహంగా ఓణీలో అచ్చం తెలుగింటి పడుచులా మెరిసిపోతోంది. హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్, దానికి తగిన జ్యువెలరీ, జడలో పూలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
By: M Prashanth | 21 Oct 2025 8:37 PM IST'బిగ్ బాస్' షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన అందం, ముక్కుసూటితనంతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది దివి వాద్యా. షో తర్వాత సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ, అటు సంప్రదాయబద్ధంగా, ఇటు గ్లామరస్‌గా కనిపిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.దీపావళి పండగను పురస్కరించుకుని దివి లేటెస్ట్ గా షేర్ చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గోల్డెన్ కలర్ లెహంగా ఓణీలో అచ్చం తెలుగింటి పడుచులా మెరిసిపోతోంది. హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్, దానికి తగిన జ్యువెలరీ, జడలో పూలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్లౌజ్లో ఆమె లుక్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
అయితే, 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 4' ఆమె కెరీర్‌కు అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ షోలో తన ప్రవర్తనతో, అందంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. 'బిగ్ బాస్' తర్వాత దివి కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆమెకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో, సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది.
మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల చిత్రాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. ప్రస్తుతం దివి చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫొటోషూట్లు పోస్ట్ చేస్తూ అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటుంది. అటు గ్లామర్, ఇటు టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు దివి గట్టిగానే ప్రయత్నిస్తోంది.
