Begin typing your search above and press return to search.

రెడ్ సారీలో దివి అందాలు.. కోపంతో ఎరుపెక్కిన!

ఒకప్పుడు హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సినిమాలలో సరైన పాత్ర కోసం ఎదురుచూసే వారు.

By:  Madhu Reddy   |   23 Feb 2026 9:24 AM IST
రెడ్ సారీలో దివి అందాలు.. కోపంతో ఎరుపెక్కిన!
X

ఒకప్పుడు హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సినిమాలలో సరైన పాత్ర కోసం ఎదురుచూసే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని తమను తాము నిరూపించుకోవడానికి ఒక సులభమైన వేదిక దొరికిందనే చెప్పాలి. అటు ఇన్స్టాగ్రామ్ ఇటు ఎక్స్ ద్వారా తమ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.




ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పాపులారిటీని దక్కించుకోవడానికి అలాగే సినిమాలలో వేగంగా అవకాశాలు సొంతం చేసుకోవడానికి ఇలా చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. మరొకవైపు గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్నారు. మొత్తానికైతే తమ అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి.. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ దివి కూడా ఒకరు. ఎప్పటికప్పుడు చీర కట్టులో అభిమానుల హృదయాలు దోచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి చీరకట్టలో కనిపించి గిలిగింతలు పెట్టింది.




సూర్యుడి కిరణాలు పడుతున్న వేళ తన శరీరాన్ని ధనస్సులా ఉంచుతూ వయ్యారాలు పోయింది. పైగా గ్లామర్ వలకబోస్తూ దివి షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని ఫోటోలలో కోపంగా చూస్తున్న లుక్కుకి మరింత ఫిదా అయిపోతున్నారు. ఎట్టకేలకు తన ఫాలోవర్స్ కు మంచి ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి.

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది.. హౌస్ లో ఉన్నది కొద్ది రోజులే అయినా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇదే షో తో చిరంజీవి దృష్టిలో కూడా పడింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఊహించని పాపులారిటీ సొంతం చేసుకునేందుకు వరుస అవకాశాలు లభించాయి. అలా హీరోయిన్గా లంబసింగి చిత్రంలో నటించిన ఈమె.. క్యాబ్ స్టోరీస్ లో మెయిన్ రోల్ పోషించింది. పుష్ప2, సింబ, రుద్రంగి , డైరీ, జిన్నా, గాడ్ ఫాదర్, డాక్ మహారాజ్ వంటి చిత్రాలలో కీలకపాత్రలో పోషించి మంచి పేరు సొంతం చేసుకుంది.

ఒకవైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటేనే మరొకవైపు పలు టాక్ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేసే ఈమె .. మొన్నా మధ్య ఒక టాక్ షోలో పాల్గొని తన లవ్, బ్రేకప్ పై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. "లవ్ లో ఫెయిల్ అయిన తర్వాత అటు అబ్బాయిలను కానీ ఇటు అమ్మాయిలను కానీ బ్యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఉన్నన్ని రోజులు వాళ్లే కదా నీకు తోపులు.. వాళ్ల వెర్షన్ లో వాళ్ళు కరెక్ట్ అయితే వీళ్ళ వెర్షన్ లో వీళ్ళు కరెక్టు.. చూసిన నలుగు ఐదుగురికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతాము. లవర్ మనతోటే ఉండాలనుకోవడం క్యూట్.. అలా అనుకుంటేనే ప్రేమ.. అలా అనుకోవడం లేదంటే అసలు అది ప్రేమే కాదు.. ముఖ్యంగా ఫ్రీడం ఉండాలి.. నాతో ఉండాలి కానీ తనకు కూడా ఒక లైఫ్ ఉంది అనేది గుర్తించాలి" అంటూ తెలిపింది. దివి అలా లవ్ పై చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.