Begin typing your search above and press return to search.

చీరకట్టులో నడుము అందాలతో గిలిగింతలు పెడుతున్న దివి!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత హీరోయిన్స్ చాలామంది తమ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.

By:  Madhu Reddy   |   4 Sept 2025 1:21 PM IST
చీరకట్టులో నడుము అందాలతో గిలిగింతలు పెడుతున్న దివి!
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత హీరోయిన్స్ చాలామంది తమ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే భిన్న విభిన్నమైన గెటప్లలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ దివి వాద్య కూడా తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ ఆధారంగా వచ్చిన 'తారకరామం' అనే పుస్తకాన్ని చదువుతూ.. మరొకవైపు తన అందాలతో యువతను కట్టిపడేసింది.


ఈమె షేర్ చేసిన ఫోటోల విషయానికి వస్తే.. స్కై బ్లూ కలర్ చీర కట్టుకున్న ఈమె.. అందులో తన నడుము అందాలను హైలెట్ చేసింది. ముఖ్యంగా బాల్కనీలో నిల్చొని వెనుక నుండి అందాలు చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. బాల్కనీ నుండి బయట ప్రపంచాన్ని చూస్తూ చల్లని వాతావరణంలో వెచ్చని ఫోజులతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ. పైగా "మౌనమేలనోయి?" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. తాజాగా దివి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. లవ్ సింబల్స్ తో పాటు హాట్ ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు. అంతేకాదు "నీకోసం ఇక్కడ వెయిటింగ్" అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. ఇంకొక అభిమాని "బాపు బొమ్మ" అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి అయితే ఈమె షేర్ చేసిన కొద్దిసేపటికే వేలల్లో వ్యూస్, కామెంట్స్, లైక్స్ రావడం గమనార్హం.


ఇక దివి కెరియర్ విషయానికి వస్తే.. బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు పాపులర్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ తెలుగు ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఈ షోతో మంచి ఇమేజ్ అందుకుంది. మరొకవైపు 2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'మహర్షి' లో చిన్న పాత్ర పోషించి వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రంతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా..అక్కడ ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో కూడా విలేకరిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అలా అప్పటినుంచి సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్ గా కనిపించే ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.


అంతేకాదు మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. "నన్ను గారాబంగా చూసుకునేవారు నా భర్తగా రావాలి. నాతో ఫ్రెండ్లీగా.. ఎప్పుడూ నన్ను చిన్న పిల్లల చూసుకునే వారంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నన్ను ఒల్లో కూర్చోబెట్టుకొని లాలించేవారు కావాలి. అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు భర్తగా రావాలి" అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మరి ఈ జనరేషన్లో దివికి అలాంటి అబ్బాయి ఎక్కడ దొరుకుతారో చూడాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.