Begin typing your search above and press return to search.

చీరలో దివి అందాలు.. దాసోహం అంటున్న కుర్రకారు!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రెటీలు తమ ఉనికిని చాటుకోవడానికి గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   31 Dec 2025 7:27 PM IST
చీరలో దివి అందాలు.. దాసోహం అంటున్న కుర్రకారు!
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రెటీలు తమ ఉనికిని చాటుకోవడానికి గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాగే చీరకట్టులో కూడా సాంప్రదాయంగా కనిపించి మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి చీరకట్టులో గ్లామర్ ఒలకబోస్తూ.. అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ప్రముఖ నటి దివి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందంతో అభిమానులను అలరించే ఈమె.. తాజాగా తన అందాలతో చీరకట్టులో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది.





తాజాగా పర్పుల్ కలర్ చీరకట్టిన ఈమె అందుకు తగ్గట్టుగా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. లోటస్ పట్టుకొని స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె వెనుతిరిగి అందాలతో అభిమానులను కట్టిపడేసింది. చాలా రోజుల తర్వాత చీర కట్టులో కనిపించడంతో అభిమానులు దానికి ముగ్ధులు అవుతున్నారు.





1996 మార్చి 15న హైదరాబాదులో శశికాంత్ వైద్య, దేవకీ దంపతులకు జన్మించింది దివి. పదవ తరగతి వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె.. ఆ తర్వాత జీ.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎమ్ టెక్ కూడా పూర్తి చేసింది దివి. చదువుకునే సమయంలోనే సినిమాల పైన ఆసక్తి పెంచుకున్న ఈమె తొలిసారి మోడల్ గా మారి 2017లో మోడలింగ్ తో తన కెరీర్ను మొదలుపెట్టింది. 2018లో పలు ఫ్యాషన్ సంస్థలకు మోడలింగ్ చేసిన ఈమె తొలిసారి లెట్స్ గో అనే షార్ట్ ఫిలింలో నటించింది.





2019లో వచ్చిన మహర్షి సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2019లో ఏ 1 ఎక్స్ ప్రెస్, 2022లో క్యాబ్ స్టోరీస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె 2021 జూలై 3న సిలక ముక్కుదాన అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించి సందడి చేసింది. సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె 2020 సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని, 49 రోజులపాటు హౌస్ లో కొనసాగి ఎలిమినేట్ అయింది.





గాడ్ ఫాదర్, రుద్రంగి, లంబసింగి, సింబా, పుష్ప2, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక టెలివిజన్ సిరీస్ హరికథలో కూడా నటించింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు నటిగా కొనసాగుతూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.