పిక్ టాక్ : జిమ్‌లో దివి వర్కౌట్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు అంతకు ముందు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది.
By: Ramesh Palla | 17 Aug 2025 1:04 PM ISTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు అంతకు ముందు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కానీ లక్కీగా బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుని ఒక్కసారిగా కెరీర్ టర్న్ అయింది. బిగ్‌బాస్ లో ఫైనల్ వరకు లేకున్నా కూడా దివికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బిగ్ బాస్ వల్ల సినిమాలు, సిరీస్‌లు దక్కించుకుంది. హీరోయిన్‌గా ఒకటి రెండు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అంతే కాకుండా హీరోయిన్స్ రేంజ్‌లో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మిలియన్‌కి పైగా ఫాలోవర్స్‌ను దక్కించుకుంది.
తెలుగు బిగ్ బాస్‌తో గుర్తింపు
2020లో హైదరాబాద్ టైమ్స్ లో మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా నిలిచిన ఈ అమ్మడు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే పలు సినిమాల్లో చేసినా కూడా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. హీరోయిన్‌గా సినిమాలు చేయాలి అని కలలు కన్న దివికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఆ సమయంలో వచ్చిన బిగ్‌బాస్ ఆఫర్ ఆమెకు మంచి బూస్ట్ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్‌లో పాల్గొన్న వారిలో అతి కొద్ది మందికి మాత్రమే మంచి గుర్తింపు వచ్చింది. అందులో దివి ఒకరు అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా బిగ్ బాస్ చేసిన తర్వాత ఆఫర్లు వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. అందుకే ఈ అమ్మడికి బిగ్‌బాస్ ఖచ్చితంగా లైఫ్ ని ఇచ్చిందని, కెరీర్‌ను నిలబెట్టిందని అంటారు.
దివి అందాల ఫోటో షూట్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మిలియన్‌కు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ దివి తాజాగా మరోసారి అందమైన ఫోటోలను షేర్ చేసింది. జిమ్‌లో ఈ అమ్మడు వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. టైట్ డ్రెస్‌లో దివి ఆకట్టుకుంటుంది. తన అందంతో ఎంతో మందిని కట్టి పడేసిన దివి ఎప్పటిలాగే ఈ వర్కౌట్ వీడియోలు, ఫోటోలతో వైరల్ అవుతోంది. తన అందమైన ఫోటోలు, వీడియోలతో ఈ అమ్మడు మెప్పించింది. అందాల దివి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ ఉంది. టైట్ జెగ్గిన్ లో స్పోర్ట్స్ బ్రా ధరించి కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడు వర్కౌట్ ఫోటోలు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మహేష్ బాబు మహర్షి మూవీలో దివి
శశికాంత్, దేవకీ దంపతులకు జన్మించిన దివి 10వ క్లాస్ వరకు స్థానిక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదివింది. ఆ తర్వాత జీ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. 2017లో మోడలింగ్ తో కెరీర్ ను మొదలు పెట్టింది. 2018 లో మొదటి సారి నటిగా కనిపించింది. మహర్షి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు బిగ్ బాస్ లో 49 రోజుల పాటు ఉన్న ఈ అమ్మడు బిగ్‌బాస్ సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా దివి ఒకటి రెండు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది. ముందు ముందు ఈమె మరిన్ని సినిమాలు, సిరీస్‌లు చేయాలని కోరుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే ఈమె కెరీర్ ముందుకు సాగించాలని అభిమానులు ఆశ పడుతున్నారు. దివి ఆ విధంగా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.
