పవన్ 'ఉస్తాద్'.. తెలుగు ప్రీమియర్స్ ఉన్నట్లా? లేనట్లా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రీమియర్ షోలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 8 March 2026 1:09 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రీమియర్ షోలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ అదే కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో భారీ హైప్ కనిపిస్తోంది.
అయితే రీసెంట్ గా మేకర్స్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చి 25వ తేదీన అక్కడ ప్రీమియర్ షోలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో విదేశాల్లో ఉన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు అది డౌటేనని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
అందుకు కారణం.. డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి అని సమాచారం. సినిమాకు ప్రీమియర్స్ వద్దని నిర్మాతలకు వారంతా కోరుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రీమియర్స్ వల్ల మొదటి రోజు తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పారని తెలుస్తోంది. అందుకే విడుదల రోజునే నార్మల్ షోలతో సినిమా రిలీజ్ చేయడం బెటర్ అని సూచిస్తున్నట్లు సమాచారం.
కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ప్రీమియర్స్ విషయంపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు రావడంతో అనేక మంది నెటిజన్లు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ ఉన్నట్లా లేనట్లా క్వశ్చన్ చేస్తున్నారు. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన స్టైలిష్ లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాటలను దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
మొదట సినిమాను మార్చి 26న విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అయితే సినిమా పనులు వేగంగా పూర్తవడంతో వారం ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న గ్రాండ్ గా విడుదల కానున్న మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ఉంటాయా? లేకుండా విడుదలవుతుందా? అన్నది మేకర్స్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనతోనే క్లారిటీ రానుంది. మార్ జరుగుతుందో వేచి చూడాలి.
