హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న దిశా పటానీ.. బాబోయ్ తట్టుకోవడం కష్టమే!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి.. అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు.
By: Madhu Reddy | 8 Sept 2025 12:46 AM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి.. అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ దిశా పటానీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదటిసారి 2015లో 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాలో తన అంద చందాలతో ఆకట్టుకోవడంతో.. తన పాత్రకు పేరు వచ్చినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈ చిన్నది.. 2016లో బాలీవుడ్లో విడుదలైన ఎమ్మెస్ ధోని సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోలకు జోడిగా నటించిన దిశాపటానీ.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను వలకబోస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది దిశపటానీ. ఇందులో వైట్ బాడీ కాన్ దుస్తులలో యద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కిల్లింగ్ లుక్స్ తో మరింత హీట్ ఎక్కించేలా కనిపిస్తోంది. పైగా తన మత్తు కళ్ళతో కుర్రాళ్లను మాయ చేసేలా కనిపిస్తూ.. మిర్రర్ ముందు ఈ ఫోటోలు దిగినట్టుగా కనిపిస్తోంది. దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి కుర్రాళ్ళు ముక్కున వేలు వేసుకుంటున్నారు. దిశా అందం రోజురోజుకి పెరుగుతోందే కానీ తగ్గడం లేదంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలతోనే బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు హాట్ అందాలతో చెమటలు పట్టిస్తోంది అని చెప్పవచ్చు.
దిశాపటానీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో కొన్నేళ్లపాటు దిశాపటానీ డేటింగ్ చేసిందని బాలీవుడ్ లో ఎన్నో రూమర్స్ వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. వాస్తవానికి పెళ్లి చేసుకుని ఒకటవుదాం అనుకున్న ఈ జంటకు టైగర్ ష్రాఫ్ తల్లి అడ్డుపడడంతో తమ రిలేషన్ కి బ్రేకప్ చెప్పుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి.
దిశా పటాని సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది యోద, కల్కి 2898 AD , కంగువ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ అనే సినిమాతో పాటుగా ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది దిశా పటానీ. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటున్న ఈమె.. ఏ మేరకు అక్కడ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
