వీడియో: ఎస్కలేటర్‌పై దిశా పటానీ టాప్ యాంగిల్ సరికాదేమో!
లక్మే ఫ్యాషన్ వీక్ వేదికగా నటి దిశా పటానీ తన గ్లామర్స్ లుక్‌తో గుబులు పెంచిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
By: Sivaji Kontham | 22 March 2026 11:24 PM ISTలక్మే ఫ్యాషన్ వీక్ వేదికగా నటి దిశా పటానీ తన గ్లామర్స్ లుక్‌తో గుబులు పెంచిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అయితే దిశాకు చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న లక్మే ఫ్యాషన్ వీక్ గ్లామర్ ప్రపంచంలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వేదికపై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తనదైన శైలిలో ర్యాంప్ వాక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అదిరిపోయే డిజైనర్ దుస్తుల్లో దిశా మెరిసిన తీరు ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. దిశాతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ వేడుకలో పాల్గొని తమ తళుకుబెళుకులతో మురిపించారు.
అయితే ఈ వేడుకలో దిశా పటానీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. దిశా వేదికకు వెళ్లకకు వెళ్లే ముందు ఎస్కలేటర్ పై వెళుతుంటే.. ఒక వ్యక్తి తనను `టాప్ యాంగిల్`లో వీడియో తీయడం చర్చనీయాంశమైంది. ఒక దురభిమాని చేసిన ఈ పనిని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం సరికాదని.. దీనిని `దురభిమానం`గా భావించాలని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
కథానాయికలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. వారికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం ఉంటాయని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. వారు ధరించే దుస్తుల విధానాన్ని బట్టి వారిని తక్కువ చేసి చూడకూడదని.. సెలబ్రిటీల విషయంలో కనీస గౌరవంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. అసభ్యంగా ఫోటోలు తీయడం, రహస్యంగా వీడియోలు తీయడం వంటి చర్యలు నేటి డిజిటల్ యుగంలో పెరిగిపోతున్నాయని.. ఇలాంటి వికృత చేష్టలను కచ్చితంగా నిరసించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
ఇక లక్మే ఫ్యాషన్ వీక్ విషయానికి వస్తే.. గత కొద్ది రోజులుగా ఈ ఈవెంట్ ముంబైలో ఎంతో ఘనంగా సాగుతోంది. ఈ ఏడాది ఫ్యాషన్ వీక్ ఐదు రోజుల పాటు జరగనుంది. ఇప్పటివరకు దిశా పటానీ, తమన్నా భాటియా, సారా అలీ ఖాన్, అనన్యా పాండే వంటి దాదాపు 15 మందికి పైగా అగ్ర కథానాయికలు పలు టాప్ బ్రాండ్ల తరపున ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. మరో రెండు రోజుల్లో మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలు ఈ వేదికపై మెరిసే అవకాశం ఉంది.
ఫ్యాషన్ షోలు అనేవి కళను, సృజనాత్మకతను ప్రదర్శించే వేదికలు. అక్కడ నటీనటుల అందాన్ని ఆస్వాధించడంలో తప్పులేదు కానీ.. వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సభ్యసమాజానికి మంచిది కాదు. దిశా పటానీ వీడియో విషయంలో వ్యక్తమవుతున్న నిరసన.. భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుందాం. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. దిశా పటానీని చివరిగా తెలుగు ఆడియెన్ కల్కి 2898 ఏడి, కంగువ చిత్రాలలో వీక్షించారు. మళ్లీ ఎప్పుడు ఈ భామ సౌత్ లో కనిపిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఫ్లాపుల కారణంగా.. అటు హిందీలో ఈ భామ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది.
