పిక్‌టాక్ : అందాల దిశాను చూపిస్తోంది
తెలుగు మూవీ 'లోఫర్'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటాని. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
By: Ramesh Palla | 8 Sept 2025 4:33 PM ISTతెలుగు మూవీ 'లోఫర్'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటాని. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా లక్ కలిసి వచ్చింది. ఎంఎస్ ధోనీ సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ దిశా పటానీకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తున్న దిశా పటానీ హీరోయిన్‌గా టాప్ పొజీషన్‌లో నిలిచింది. తెలుగులో మళ్లీ ఇన్నాళ్లకు కల్కి 2898 ఏడీ సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌లో దిశా మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా కంటే ఎక్కువగా అందాల ఆరబోత ఫోటోల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా దిశా పటానీ బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో రాబోతుంది.
అందాల దిశా పటానీ ఫోటో వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో 61.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న దిశా పటానీ ఎప్పుడు ఏ ఫోటో షేర్ చేసినా నిమిషాల్లో లక్షల లైక్స్ రావడం మనం చూస్తూ ఉంటాం. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ దిశా సొంతం అని చాలా సార్లు నిరూపితం అయ్యింది. మరోసారి ఈ ఫోటోలతో దిశా పటానీ తన అందాలను చూపించే ప్రయత్నం చేసింది. ఆకట్టుకునే అందం కారణంగా దిశా పటానీ ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా క్యూట్ ఫోటోలను షేర్ చేసిన దిశా పటానీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ ఔట్ ఫిట్‌లో దిశా చాలా అందంగా కనిపిస్తోంది. అందమైన దిశా లుక్‌ని ఆమె లిప్‌స్టిక్ మరింతగా పెంచింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చక్కని రూపం ఉన్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీ ఫోటో
దిశా పటానీ యొక్క ఈ సింపుల్ లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్ షో చేస్తూ రెడ్ లిప్స్ తో గుండెలు జారేలా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ దిశా పటానీ మరోసారి తన సత్తా ఏంటో ఈ ఫోటోలతో చూపింది అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా దిశా పటానీ అందం చాలా స్పెషల్ అంటూ ఇలాంటి ఫోటోలకు అభిమానులు తెగ కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి దిశా అందం గురించి ఈ ఫోటోల కారణంగా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆకట్టుకుంటున్న ఈ అందమైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు ఒక లుక్ వేయడం ద్వారా దిశా అందాన్ని కన్నులతో ఆస్వాదించండి అంటూ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
సూర్య కంగువా సినిమాలో
దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీస్ ఆఫీసర్ కాగా, తల్లి హెల్త్ ఇన్‌స్పెక్టర్ అనే విషయం తెల్సిందే. అంతే కాకుండా దిశా సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. లక్నో యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివిన దిశా పటానీ 2013లో ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ రన్నరప్‌గా నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న కారణంగా బాలీవుడ్‌లో వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్న దిశా పటానీ ముందు ముందు సౌత్‌లోనూ మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తమిళ్‌లో ఈమె చేసిన కంగువా సినిమా నిరాశ పరిచిన నేపథ్యంలో మరో తమిళ సినిమాలో ఈమె నటించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దిశా మళ్లీ కోలీవుడ్‌లో సినిమాను చేసే అవకాశం ఉందా అనేది చూడాలి.
