ఫోటో స్టోరి: మళ్లీ మత్తులోకి దించిన చికిరీ
'లోఫర్' బ్యూటీ దిశా పటానీ అన్ లిమిటెడ్ గ్లామర్ ట్రీట్ ఎప్పుడూ యూత్ లో ట్రెండ్ గా మారుతుంది.
By: Sivaji Kontham | 24 Nov 2025 9:00 PM IST'లోఫర్' బ్యూటీ దిశా పటానీ అన్ లిమిటెడ్ గ్లామర్ ట్రీట్ ఎప్పుడూ యూత్ లో ట్రెండ్ గా మారుతుంది. దిశాకు సోషల్ మీడియా సహా ఇంటర్నెట్ లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టా, ఎక్స్ ఖాతాలు సహా చాలా వేదికలపై దిశా పటానీ ఫోటోగ్రాఫ్స్ , వీడియోలు నిరంతరం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక దిశాను ఇన్ స్టాలో దాదాపు 63లక్షల మంది అనుసరిస్తున్నారు.
వీళ్లందరి కోసం దిశా నిరంతర ఫోటోట్రీట్ సిద్ధంగా ఉంటుంది. ఇటీవల కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను దిశా ప్రచారం చేస్తోంది. సీకే బ్రాండ్ లేటెస్ట్ వెర్షన్ వాచ్ లను కూడా మార్కెట్లోకి దించుతూ దిశాతో ప్రచారం చేయించుకుంది. ఇక దిశా ఎప్పటిలాగే మైండ్ బ్లాక్ చేసే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
ఇటీవల వరుసగా బాడీ హగ్గింగ్ డిజైనర్ దుస్తులతో గుబులు పుట్టిస్తోంది. ఈ సిరీస్ లో ఇప్పుడు ఒక కొత్త ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ క్రిస్టల్స్, మిర్రర్ అల్లికలతో అందమైన డిజైనర్ ఫ్రాక్ ని ధరించి రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది. బంగారు రంగు బాడీ హగ్గింగ్ ఫ్రాక్ నెవ్వర్ బిఫోర్ ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాక్ లెస్ .. షోల్డర్ లెస్ ఎలివేషన్ తో ఈ డిజైనర్ ఫ్రాక్ ని తీర్చిదిద్దిన విధానం, మిర్రర్ వర్క్ ప్రతిదీ సంథింగ్ స్పెషల్ గా కుదిరాయి అనడంలో సందేహం లేదు.
నటిగా కెరీర్ మ్యాటర్ కి వస్తే, టాలీవుడ్ లో లోఫర్ చిత్రంలో నటించిన దిశా పటానీ, ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్ లో నటించింది. కానీ హిందీ చిత్రసీమలోనే ఎక్కువ సినిమాలకు సంతకాలు చేసింది. కానీ అక్కడా ఆశించిన విజయాలు దక్కలేదు. గడిచిన రెండేళ్లలో సౌత్ లో వరుస చిత్రాలతో బిజీ అయింది. ప్రభాస్ సరసన కల్కి చిత్రంలోను కీలక పాత్రను పోషించింది. సూర్య కంగువ లోను దిశా ఓ ఆసక్తికర పాత్రలో కనిపించింది. అయితే లోఫర్ నుంచి కల్కి 2898 ఏడి వరకూ దిశా ప్రయాణంలో ఆశించినన్ని విజయాలు లేవు. అయినా ఈ బ్యూటీ కి అవకాశాల పరంగా కొదవేమీ లేదు. దీనికి తోడు నిరంతరం సోషల్ మీడియా క్వీన్ గా హృదయాలను ఏల్తూనే ఉంది. సినిమాలతో ఆదాయం ఎలా ఉన్నా సోషల్ మీడియా యాడ్స్, ఇతర వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్ ఈవెంట్లతోను అదనంగా ఆర్జిస్తోంది.
