అంటిలియాలో దిశా పటానీ గ్లామర్ షో.. ఆ లెహంగా ధర వింటే షాక్!
ట్రెడిషన్ తో పాటు గ్లామర్ జోడించి దిశా చేసిన ఈ ఫ్యాషన్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ కాస్ట్లీ డ్రెస్, జ్యువెలరీ వివరాలు ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 18 Sept 2026 6:00 PM ISTముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో ఇటీవల జరిగిన వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు బాలీవుడ్ తారలంతా తరలివచ్చారు. అయితే, ఇందులో అందరి చూపు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ వైపే మళ్లింది. ఎరుపు రంగు రాయల్ లెహంగాలో, దగదగలాడే డైమండ్ ఆభరణాలతో ఆమె అచ్చం ఒక దేవకన్యలా మెరిసిపోయింది. ట్రెడిషన్ తో పాటు గ్లామర్ జోడించి దిశా చేసిన ఈ ఫ్యాషన్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ కాస్ట్లీ డ్రెస్, జ్యువెలరీ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాయల్ రెడ్ లెహంగా మరియు బ్లౌజ్:
దిశా పటానీ ధరించిన ఎరుపు రంగు కస్టమ్ లెహంగా ఎంతో అట్రాక్టివ్‌గా ఉండి ఈవెంట్ లోనే అందరినీ ఆకర్షించింది. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ఆమెకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. కేవలం ఈ కస్టమ్ లెహంగా అంచనా ధర సుమారు రూ. 2,50,000 వరకు ఉంటుందని టాక్. దానికి మ్యాచింగ్‌గా ఎంతో శ్రద్ధతో డిజైన్ చేసిన కస్టమ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధర రూ. 65,000 గా ఉంది. ఇక ఈ గ్లామరస్ లుక్‌కి మరింత రాయల్ టచ్ ఇచ్చేందుకు ఆమె ప్రత్యేకంగా వాడిన కస్టమ్ దుపట్టా ధర ఏకంగా రూ. 75,000 కావడం విశేషం.
మెరిసే పోల్కీ డైమండ్ ఆభరణాలు:
ఈ ఖరీదైన లెహంగా డ్రెస్ కు తగినట్లుగానే దిశా పటానీ అత్యంత విలువైన డైమండ్ జ్యువెలరీని ఎంచుకుంది. రోజ్ కట్ పోల్కీ డైమండ్స్ తో చేసిన ఆభరణాలు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఆమె చెవులకు ధరించిన డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ దాదాపు రూ. 4,80,000 వరకు ఉంటుంది. అలాగే, కుడి చేతికి పెట్టుకున్న రిచ్ పోల్కీ డైమండ్ బ్రాస్‌లెట్ ధర రూ. 6,50,000 కాగా, చేతి వేలికి మెరుస్తున్న గ్రాండ్ స్టేట్‌మెంట్ డైమండ్ రింగ్ ధర సుమారు రూ. 3,20,000 గా ఉన్నట్లు అంచనా.
స్టైలిష్ జిమ్మీ చూ శాండల్స్ :
కేవలం ఖరీదైన దుస్తులు, నగలు మాత్రమే కాకుండా దిశా పటానీ వేసుకున్న ఫుట్‌వేర్ కూడా ఈ ఈవెంట్ లో ఎంతో స్పెషల్ గా నిలిచింది. తన ఎలిగంట్ లుక్ కోసం దిశా ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన 'జిమ్మీ చూ' కి చెందిన హై హీల్స్ శాండల్స్‌ను ఎంచుకుంది. చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉన్న ఈ బ్రాండెడ్ శాండల్స్ అంచనా ధర రూ. 89,000 గా ఉంటుంది. అడుగులో అడుగు వేస్తూ ఆమె నడిచి వస్తుంటే ఈ బ్రాండెడ్ హీల్స్ అందరి దృష్టినీట్టే ఆకర్షించాయి.
ట్రెడిషన్ అండ్ మోడర్న్ ఫ్యాషన్ మిక్స్ :
సాధారణంగా దిశా పటానీ వెస్ట్రన్ లేదా మోడర్న్ డ్రెస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి అంబానీ ఇంట జరిగిన పండగకు మాత్రం సాంప్రదాయం, మోడర్న్ ఫ్యాషన్ కలగలిపిన ఈ ఐకానిక్ లుక్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఇక రెడ్ కలర్ కస్టమ్ లెహంగాలో, తనదైన మార్క్ గ్లామర్ షోతో వినాయక చవితి వేడుకల్లో ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్యాషన్ ప్రియులకు ఆమె ట్రెడిషనల్ లుక్ ఒక పర్ఫెక్ట్ ట్రీట్ లా అనిపించి వారిని ఫిదా చేసింది.
ఇక మొత్తంగా చూసుకుంటే, దిశా పటానీ ధరించిన ఈ రెడ్ లెహంగా, డైమండ్ నగలు, జిమ్మీ చూ శాండల్స్ అన్నీ కలిపి అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. లక్షల రూపాయలు వెచ్చించి ఆమె డిజైన్ చేయించుకున్న ఈ పర్ఫెక్ట్ ఫెస్టివల్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అంబానీ వేడుకల్లో సెలబ్రిటీల ఫ్యాషన్ కు ఏమాత్రం కొదవే ఉండదు అనడానికి దిశా పటానీ ప్రదర్శించిన ఈ రాయల్ గ్లామరస్ అవతారమే ఒక బెస్ట్ ఉదాహరణ అని కచ్చితంగా చెప్పొచ్చు.
