Begin typing your search above and press return to search.

ట్రెండీ దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తున్న దిశా పటానీ!

ఇకపోతే తమ అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా మ్యాగజైన్ కవర్ పేజీలపై కూడా దర్శనమిచ్చి అటు గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   26 Jan 2026 5:00 PM IST
ట్రెండీ దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తున్న దిశా పటానీ!
X

ఇటీవల కాలంలో హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొంతమంది గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయగా.. మరి కొంతమంది సాంప్రదాయంగా కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. మరికొంతమంది అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే తమ అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా మ్యాగజైన్ కవర్ పేజీలపై కూడా దర్శనమిచ్చి అటు గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకి ఇప్పుడు దిశాపటానీ కూడా చేరిపోయింది.




ముఖ్యంగా తన అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ఈ చిన్నది తాజాగా కవర్ పేజీ పై మెరిసి తన ట్రెండీ దుస్తులతో మరోసారి వార్తల్లో నిలిచింది. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా.. అవి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సింపుల్ లుక్ లో చాలా ట్రెండీగా కనిపిస్తూ తన అవుట్ ఫిట్ తో ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. ప్రస్తుతం కవ్వించే కళ్ళతో మత్తెక్కించేలా మాయ చేస్తూ.. తన ట్రెండీ ఔట్ఫిట్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.




వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఈ ఫ్రాక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. మరో ఫోటోలో రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చగొట్టింది. ఇంకొక వైపు బ్లాక్ డ్రెస్సులో మెప్పించింది. అలా భిన్నమైన రకరకాల ట్రెండీ అవుట్ ఫిట్స్ తో అందరినీ ఆకట్టుకుంది దిశా పటాని. మొత్తానికైతే దిశా పటానీ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఫాలోవర్స్ ఈమె అందానికి ముగ్ధులు అవుతున్నారు. అంతేకాదు తమ మనసులోని భావాలను కవిత్వాల రూపంలో వ్యక్తపరుస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.




టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలో ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది దిశా పటాని. అక్కడే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె పలు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి సందడి చేసింది.




ఇకపోతే తన అద్భుతమైన నటనతో అవార్డులు కూడా అందుకుంది దిశాపటాని. 2017లో ఈమె నటించిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాకి గానూ .. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ యాక్టర్ అరంగేట్రం విభాగంలో అవార్డు అందుకుంది. అలాగే ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో స్టార్ స్క్రీన్ అవార్డు, స్టార్ డస్ట్ అవార్డు, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిమ్స్ అకాడమీ అవార్డులను కూడా అందుకుంది. ఇక 2018లో ఈమె నటించిన భాగీ 2 చిత్రానికి గానూ లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డు దక్కించుకుంది.