Begin typing your search above and press return to search.

రెడ్ ఫ్రాక్‌లో దిశా ప‌టానీ స్పెష‌ల్ ట్రీట్

నేటి జెన్ జెడ్ స్టార్ కిడ్స్ జాన్వీ, సారా, ఖుషి, షాన‌యా వంటి వారికి ఎప్పుడూ దిశా ప‌టానీ ఎప్పుడూ బిగ్ కాంపిటీట‌ర్.

By:  Sivaji Kontham   |   11 Aug 2025 10:19 AM IST
రెడ్ ఫ్రాక్‌లో దిశా ప‌టానీ స్పెష‌ల్ ట్రీట్
X

బికినీలు.. మోనోకినీలు.. స్విమ్ సూట్లు .. పొట్టి స్క‌ర్టులు .. ఎంపిక చేసుకునే దుస్తులు ఏవైనా దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ బోయ్స్ ని స్పెల్ బౌండ్ చేస్తుంది. దిశా ఫోటోషూట్లు నిరంత‌రం ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. నేటి జెన్ జెడ్ స్టార్ కిడ్స్ జాన్వీ, సారా, ఖుషి, షాన‌యా వంటి వారికి ఎప్పుడూ దిశా ప‌టానీ ఎప్పుడూ బిగ్ కాంపిటీట‌ర్.


జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేసినా, మార్కెట్లో కూర‌గాయ‌లు కొంటున్నా, రెస్టారెంట్ నుంచి తిరిగి వెళుతున్నా ఈ అమ్మ‌డిపైనే క‌ళ్ల‌న్నీ. ఔటింగ్ కి వెళ్లిన‌ప్పుడు కచ్ఛితంగా త‌న లుక్ విష‌యంలో దిశా ఎంతో కేర్ ఫుల్ గా ఉంటుంది. యూత్ ని ఈ రేంజులో టీజ్ చేయ‌డం ఏ ఇత‌ర క‌థానాయిక‌కు సాధ్యం కాదు అన్నంతగా చెల‌రేగుతుంది. టాలీవుడ్ లో లోఫ‌ర్ చిత్రంలో న‌టించిన దిశా ప‌టానీ, ఆ త‌ర్వాత ఎంఎస్ ధోని బ‌యోపిక్ లో న‌టించింది. ఇటీవ‌ల సౌత్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీ అయింది. మొన్న‌టికి మొన్న‌ ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌ల్కి చిత్రంలోను కీల‌క పాత్ర‌ను పోషించింది. అయితే లోఫ‌ర్ నుంచి క‌ల్కి 2898 ఏడి వ‌ర‌కూ దిశా ప్ర‌యాణంలో ఆశించిన‌న్ని విజ‌యాలు లేవు. అయినా ఈ బ్యూటీ కి అవ‌కాశాల ప‌రంగా కొద‌వేమీ లేదు. దీనికి తోడు నిరంత‌రం సోష‌ల్ మీడియా క్వీన్ గా హృద‌యాల‌ను ఏల్తూనే ఉంది. సినిమాల‌తో ఆదాయం ఎలా ఉన్నా సోష‌ల్ మీడియా యాడ్స్, ఇత‌ర‌ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, ఫ్యాష‌న్ ఈవెంట్ల‌తోను అద‌నంగా ఆర్జిస్తోంది.


ముఖ్యంగా ఇన్ స్టా మాధ్య‌మంగా దిశా త‌న ఫాలోవ‌ర్ల‌ను అంత‌కంత‌కు పెంచుకుంటూనే ఉంది. తాజాగా దిశా త‌న ఇన్ స్టాగ్ర‌మ్‌లో రెడ్ హా*ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఒక అంద‌మైన ఎరుపు రంగు ఫ్రాక్ లో దిశా టోన్డ్ అందాల‌ను ఎలివేట్ చేసిన తీరు యువ‌త‌రాన్ని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. దిశా స్పెష‌ల్ రివీలింగ్ ఔట్ ఫిట్ లో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంద‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. దిశా ప‌టానీ ఇటీవ‌ల సౌత్ సినిమాల‌తో ఫ్యాన్స్ ని అల‌రించింది. త‌దుప‌రి పెద్ద హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల వేట‌లో ఉంది. పెద్ద‌ ప్ర‌క‌ట‌న‌ల కోసం వేచి చూస్తోంది.