వీడియో: 34 వయసు దిశా పటానీతో 60ఏజ్ హీరో రొమాన్స్ స్టన్నయిపోతారంతే!
ఒంటిపై నూలు పోగైనా ఎందుకులే.. అసలు దుస్తులు ఎందుకు ధరించామో అని కలత చెందుతూ.. పటానీ, జాకీ పాపం పొట్టి పేలికల్లాంటి వస్త్రాల్ని ధరించి యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చారని తాజా విజువల్స్ చెబుతున్నాయి.
By: Sivaji Kontham | 26 Jun 2026 10:52 PM ISTఅరెరే! వెల్ కం3 నుంచి సెన్సార్ మొత్తం 20 కట్స్ ఎందుకు చెప్పిందో ఇప్పుడు లీక్ చేసిన ఈ ఐటమ్ నంబర్ లేదా స్పెషల్ నంబర్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. అసలు దిశా పటానీ ఒంటిపై నూలు పోగులు తప్ప ఇంకేవీ లేవ్.. ఈ సినిమాలో దిశాపటానీ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒకరితో ఒకరు పోటీపడుతూ చిట్టి పొట్టి దుస్తులు, బికినీల్లో గోల పెట్టించారని గుసగుసలు వినిపించాయి.
ఓవరాల్ గా వెల్ కం 3లో భగభగ మండించే ఎలిమెంట్స్ ఉన్నాయని తాజా లీకులను బట్టి అర్థమవుతోంది. అయితే అనవసరంగా మధ్యలో ఈ సెన్సార్ గోల లేకపోతే వాటన్నిటినీ ఎంచక్కా జనం థియేటర్లలో చూసి తరించేవారే.. చాలా మంది సీనియర్ వృద్ధ హీరోల మొహాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చు.. అందుకే తెలివిగా దర్శకుడు అహ్మద్ ఖాన్ దిశా పటానీ, జాక్విలిన్ లాంటి అందగత్తెలను బరిలో దించాడు. ఇక నడి సముద్రంలో బీచ్ ఇసుకలో దిశా పటానీపై షూటింగ్ అంతా మత్తు మత్తుగా చిత్తు చిత్తుగా సాగిందని తాజాగా రివీల్ చేసిన విజువల్స్ చెబుతున్నాయి.
ఒంటిపై నూలు పోగైనా ఎందుకులే.. అసలు దుస్తులు ఎందుకు ధరించామో అని కలత చెందుతూ.. పటానీ, జాకీ పాపం పొట్టి పేలికల్లాంటి వస్త్రాల్ని ధరించి యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చారని తాజా విజువల్స్ చెబుతున్నాయి. అక్కీ- దిశా పటానీ జంటపై గుబులు పుట్టించే ఐటమ్ నంబర్ ని తెరకెక్కించారని ఈ వీడియో చూడగానే అర్థమైపోతోంది. ఇక ఈ విజువల్స్ చూడగానే సుమారు 60 వయసుకు చేరువైన సీనియర్ హీరో ఇలా 34 వయసు అమ్మాయితో రోమాంచితంగా చెలరేగిపోవడం సరైనదేనా? అని కొందరు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన హాస్య చిత్రాల సిరీస్‌లో వస్తున్న మూడవ భాగం `వెల్‌కం టు ద జంగిల్` భారీ తారాగణంతో రూపొందుతోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత ఫిరోజ్ ఎ. నడియాద్వాలా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, అర్షద్ వార్సిలతో పాటు పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్పాల్ యాదవ్ తదితరులు నటిస్తున్నారు. వీరితో పాటు రవీనా టాండన్, శిల్పా శెట్టి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, లారా దత్తా వంటి కథానాయికలు కూడా ఈ సినిమాలో భాగం కావడం వల్ల ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఒకే తెరపై ఇంతమంది అగ్ర నటులను చూపించనుండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ సుదీర్ఘంగా సాగింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విదేశీ షెడ్యూల్స్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఈ చిత్రం అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యమైంది. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ క్రేజీ ఎంటర్‌టైనర్ భారీగా థియేటర్లలో విడుదల కానుంది.
