వీడియో : జిమ్‌లో అందాల దిశా మత్తెక్కించే డాన్స్
పదేళ్ల క్రితం తెలుగు సినిమా 'లోఫర్'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ.
By: Ramesh Palla | 4 Aug 2025 5:00 PM ISTపదేళ్ల క్రితం తెలుగు సినిమా 'లోఫర్'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఆ సినిమా నిరాశ పరచినప్పటికీ లక్కీగా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. మొదటి సినిమా ఫ్లాప్‌తో నిరుత్సాహానికి గురి కాకుండా దిశా పటానీ ముందుకు సాగింది. హిందీలో ఈమె చేసిన మొదటి సినిమా ఎంఎస్ ధోనీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ ఎక్కువ గుర్తింపు దక్కింది. సోషల్ మీడియాలో ఆ సమయంంలో దిశా పటానీ గురించిన చర్చ జరిగింది. అక్కడ నుంచి దిశా పటానీ జర్నీ ఊపు అందుకుంది. హిందీలో వరుసగా సినిమాలు చేయడం ద్వారా నార్త్ ఇండియా మొత్తం పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని పలు సార్లు నిరూపితం అయింది.
ప్రభాస్ కల్కిలో దిశా పటానీ
బాలీవుడ్‌లో బాఘీ ప్రాంచైజీతో దిశా పటానీకి మంచి పేరు దక్కింది. ముఖ్యంగా ఆ సినిమా దిశా ను కమర్షియల్ హీరోయిన్‌గా నిలిపింది అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు గత ఏడాది హిందీ సినిమా యోధతో పాటు, సౌత్ సినిమాలు కల్కి, కంగువా తో వచ్చిన విషయం తెల్సిందే. తెలుగులో చేసిన కంగువా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. కానీ ఆ సినిమాలో దిశా పటానీ పాత్ర పరిమితంగా ఉండటంతో ఆమెకు నిరాశే మిగిలింది. ఇక కంగువా సినిమాపైనా చాలా ఆశలు పెట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా ఆ సినిమా నిలిచిన విషయం తెల్సిందే.
ఇన్‌స్టాలో దిశా పటానీ వైరల్ వీడియో
సినిమాల ఫ్లాప్స్ ఎప్పుడూ దిశా పటానీని కృంగదీయలేదు. ఆమె ముందుకు సాగేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. రెగ్యులర్‌గా చక్కని స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకుంటూ లోఫర్ బ్యూటీ సినిమాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వీడియోలతోనూ దిశా ఆకట్టుకుంటూ ఉంది. ఇన్‌స్టాలో ఏకంగా 61 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న దిశా పటానీ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో వర్కౌట్స్ చేయకుండా, డాన్స్ చేస్తూ ఆ వీడియోలో కనిపించింది. జిమ్ కోసం వేసుకున్న మినీ షార్ట్ తో పాటు స్పోర్ట్స్ బ్రా ను ధరించిన దిశా పటానీ డాన్స్ తో మత్తెక్కించింది. అక్కడ ఆమె చేసిన డాన్స్ మూమెంట్స్‌కి గుండె జారి గల్లంతయ్యిందే అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
జిమ్ డ్రెస్‌లో అందాల డాన్స్
నెట్టింట దిశా పటానీ గతంలో ఎన్నో సార్లు అందమైన ఫోటోలు, అందాల ఆరబోత వీడియోలను షేర్ చేసింది. కానీ ఇది చాలా విభిన్నంగా ఉందని, చైర్ ప్రాపర్టీని ఉపయోగించుకుంటూ దిశా పటానీ చేసిన డాన్స్‌ను చాలా మంది లైక్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ అమ్మడు చేసిన డాన్స్ కి లక్షల్లో లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్న వారు ఉన్నారు. షేర్ చేస్తూ తమ అభిమాన దిశా డాన్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇలాంటి డాన్స్‌ను మొదటి సారి ట్రై చేశాను అంటూ దిశా తన వీడియో కామెంట్ లో పేర్కొంది. వర్కౌట్ ఔట్ ఫిట్ లో డాన్స్ చేయడం అనేది కాస్త విభిన్నమైన ఆలోచన అని, అందుకే ఈ వీడియో ఇంతగా వైరల్ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు.
