సీక్వెల్ కి సిద్ధమైన ఇమ్రాన్ హష్మీ. ఆ రొమాంటిక్ డ్రామా రిపీట్!
ఇమ్రాన్ హష్మీ.. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈయన బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసి నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
By: Madhu Reddy | 27 Sept 2025 11:00 PM ISTఇమ్రాన్ హష్మీ.. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈయన బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసి నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. కానీ తెలుగులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'ఓజీ' సినిమాలో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓమీ అనే పాత్రలో ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా ఒదిగిపోయారు అనే చెప్పాలి. దీనికి తోడు హీరో రేంజ్ లో ఎలివేట్ అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన ఇప్పుడు తాజాగా రొమాంటిక్ డ్రామా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విషయంలోకి వెళ్తే.. 2007లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'ఆవారాపన్'. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఆవారాపన్ 2' అంటూ రాబోతోంది. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా ఎంపికయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అటు బ్యాంకాక్ లో కూడా నెల రోజులపాటు జరగనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇక్కడే 50 శాతానికి పైగా సినిమా షూటింగ్ చేయనున్నారు. అంతేకాదు ఇప్పుడు ఎక్కువగా నిజమైన ప్రదేశాలలోనే షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం అందులో భాగంగానే ఆయా ప్రదేశాలకు వెళ్లి అక్కడే చాలా నేచురల్ గా ఈ సినిమా షూటింగ్ జరపబోతున్నారట .
ఇదిలా ఉండగా.. ఆవారాపన్ సినిమాలో సంగీతం కీలకంగా ఉంటుంది. మరి ఈ సీక్వెల్ సినిమాలో సంగీతం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఆవారాపన్ 2 సినిమా విషయానికి వస్తే.. ఇది ఒక అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లోపు పూర్తీ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశేశ్ భట్ నిర్మిస్తున్నారు. మొత్తానికి శివం పాత్రలో ఇమ్రాన్ తిరిగి రాబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఇమ్రాన్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ఇమ్రాన్ హస్మి కెరియర్ విషయానికి వస్తే.. 2003లో వచ్చిన ఫుట్ పాత్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక తర్వాత మర్డర్, తుమ్సా నహి దేఖా ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే హిందీలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈయన తొలిసారి తెలుగులో ఓజీ సినిమాలో నటించి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
