దిశా పటానీ ఫోకస్ మొత్తం అక్కడేనా.. వర్క్ అవుట్ అవుతుందా?
బాలీవుడ్ హాట్ అండ్ గ్లామరస్ నటి దిశా పటానీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఇప్పుడు బిజినెస్ ఉమెన్‌గా కొత్త అవతారం ఎత్తారు.
By: Madhu Reddy | 29 Oct 2026 3:39 PM ISTబాలీవుడ్ హాట్ అండ్ గ్లామరస్ నటి దిశా పటానీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఇప్పుడు బిజినెస్ ఉమెన్‌గా కొత్త అవతారం ఎత్తారు. తనదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఈ భామ, తాజాగా ‘DZ’ పేరుతో ఒక కొత్త ఫ్యాషన్ అండ్ క్లోథింగ్ బ్రాండ్‌ను అధికారికంగా రేపు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. నటనలోనే కాకుండా తనలోని డిజైనింగ్ ఆలోచనలను వ్యాపారంలోకి తీసుకొస్తూ దిశా తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ విశేషాలు చూద్దాం..
'DZ' బ్రాండ్ విశేషాలు.. ఓవర్ సైజ్డ్ ఫ్యాషన్;
దిశా పటానీ ప్రారంభించిన ‘DZ’ క్లోథింగ్ బ్రాండ్‌లో లూజ్‌గా, ఓవర్సైజ్డ్గా ఉండే దుస్తులు ఎక్కువగా ఉన్నాయి. సాధారణ క్యాజువల్ వేర్‌కు భిన్నంగా కొత్త స్టైల్స్‌తో ఈ కలెక్షన్‌ను రూపొందించారు. దిశాకు కూడా వదులుగా, సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడం ఇష్టమట. అందుకే తనకు నచ్చిన స్టైల్లోనే ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
స్పేస్ అండ్ ఏలియన్ డిజైన్స్ హైలైట్:
ఈ 'DZ' క్లోథింగ్ లైన్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే.. స్పేస్, కాస్మిక్ అండ్ ఏలియన్ ఇన్స్పైర్డ్ డిజైన్స్.. సాధారణంగా లభించే బట్టల శైలికి భిన్నంగా అంతరిక్షం మరియు గ్రహాంతరవాసుల థీమ్, గ్రాఫిక్స్ ఉపయోగించడం ద్వారా ఈ బ్రాండ్‌కు ఒక ప్రత్యేకమైన అల్ట్రా మోడరన్ అండ్ ఫ్యూచరిస్టిక్ లుక్ వచ్చింది. స్టైలిష్ స్ట్రీట్ వేర్ కలెక్షన్స్ ఇష్టపడే యూత్‌కి ఇది బాగా నచ్చుతుందని చెప్పవచ్చు.
బ్లీచ్డ్ ఐబ్రోస్.. సరికొత్త ప్రమోషనల్ ట్రాక్:
తన బ్రాండ్‌ను వినూత్నంగా ప్రమోట్ చేయడం కోసం దిశా ఒక స్పెషల్ మ్యూజిక్ ట్రాక్‌ను కూడా విడుదల చేశారు. ఈ ప్రెజెంటేషన్‌లో ఆమె మునుపెన్నడూ చూడని బోల్డ్ లుక్ లో కనిపించారు. ముఖ్యంగా 'బ్లీచ్డ్ ఐబ్రోస్' తో డిఫరెంట్ మేకప్ అండ్ స్టైలింగ్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రమోషనల్ లుక్స్ మరియు వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
బిజినెస్‌లోకి అడుగుపెట్టిన స్టార్స్:
ఇటీవలి కాలంలో సినీ నటీనటులు తమ పాపులారిటీని ఉపయోగించుకుని స్వంత ఫ్యాషన్ బ్రాండ్లను ప్రారంభించడం ఒక ట్రెండ్‌గా మారింది. అదే బాటలో దిశా పటానీ కూడా ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన పర్సనల్ ఫ్యాషన్ టేస్ట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
మొత్తానికి చూస్తే, వెండితెరపై గ్లామర్ పాత్రలతో అలరించిన దిశా పటానీ, ఇప్పుడు 'DZ' క్లోథింగ్ బ్రాండ్ ద్వారా తన వ్యాపార ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించారు. ఇక స్పేస్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్స్‌తో వచ్చిన ఈ కొత్త ట్రెండ్ స్ట్రీట్ వేర్ రంగాన్ని ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
