Begin typing your search above and press return to search.

పిక్ టాక్: DZ 001తో దిశా పటానీ గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలే ఫొటోలు!

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్‌ అవుతూ ఉంటుంది.

By:  Ramesh Palla   |   27 Oct 2026 10:00 PM IST
పిక్ టాక్: DZ 001తో దిశా పటానీ గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలే ఫొటోలు!
X

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 60 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు తనకంటూ ఒక సొంత బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకుంది. క్లోథింగ్‌ బిజినెస్‌ను ప్రారంభించిన దిశా పటానీ ఇతర హీరోయిన్స్‌కి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది. DZ అనే బ్రాండ్‌తో బిజినెస్‌ ప్రారంభించిన దిశా పటానీ తానే సొంతంగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. సరికొత్త ఔట్‌ ఫిట్స్‌ ను కోరుకునే వారి కోసం ఎప్పటికప్పుడు కొత్త ట్రెండీ దుస్తులను తీసుకు వస్తున్న దిశా పటానీ తాజాగా కొత్త ఔట్‌ ఫిట్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త ఔట్‌ ఫిట్‌తో దిశా పటానీ స్వయంగా ఫోటో షూట్‌ చేసి సోషల్‌ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తుంది. ఈ సరికొత్త ఔట్‌ ఫిట్‌ కి మంచి స్పందన దక్కింది. దిశా పటానీ ధరించడం ద్వారా ఆ ఔట్‌ ఫిట్‌కి మంచి క్రేజ్‌ దక్కింది అనడంలో సందేహం లేదు.





దిశా పటానీ హీరోయిన్‌గా...

మోడలింగ్‌తో కెరీర్‌ మొదటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ దిశా పటానీ ఇప్పుడు తన సొంత బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తోంది. రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటో షూట్‌ ను షేర్‌ చేసే ఈ అమ్మడు ఇప్పుడు కూడా అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, తన బ్రాండ్‌ ను సైతం ప్రమోట్‌ చేసుకుంటోంది. DZ 001 అనే సరికొత్త మోడల్‌ వచ్చింది అంటూ ఈ ఫోటోలను దిశా షేర్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలకు మంచి స్పందన వచ్చింది. దిశా పటానీని ఈ ఫోటోలో చూసిన వారు చాలా మంది ఏం చూపించింది మామ అంటూ కామెంట్‌ చేస్తూ ఉన్నారు. సినిమాల్లో కంటే దిశా ను ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువగా చూస్తున్నామని కొందరు, సినిమాల్లో కంటే ఇలాంటి ఫోటో షూట్స్ లోనే ఎక్కువ అందంగా కనిపిస్తోందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.





లోఫర్‌ సినిమాతో పరిచయం...

ఇక దిశా పటానీ సినిమాల విషయానికి వస్తే.. 2015లో తెలుగు సినిమా లోఫర్‌ తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌కి జోడీగా దిశా నటించింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయినప్పటికీ లక్కీగా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో ఆఫర్లు దక్కాయి. బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కాయి. బాలీవుడ్‌లో ఈ అమ్మడు భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌ జాబితాలో చేరింది. ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ లో బిజీగా ఉంది. 2024లో ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. గత ఏడాది కొన్ని కారణాల వల్ల సినిమాలు రాలేదు, కానీ ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.





బాలీవుడ్‌లో వరుస సినిమాలు..

దిశా పటానీ ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. సినిమాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే సినిమాల గురించి దిశా పటానీ స్పందించే అవకాశం ఉంది. సినిమాలు వచ్చినా రాకున్నా, షూటింగ్స్ లో పాల్గొన్నా పాల్గొనక పోయినా కూడా దిశా పటానీ నుంచి వరుసగా ఫోటో షూట్స్ వస్తూనే ఉంటాయి. ఈ అమ్మడు సినిమాల కంటే ఎక్కువ ఫోటో షూట్స్‌ లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తుందని కొందరు అంటూ ఉంటారు. బాలీవుడ్‌లో చాలా మంది స్టార్‌ హీరోయిన్స్‌ కంటే ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ. దీన్ని బట్టి ఈ అమ్మడి సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సౌత్‌లో ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈమె కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పట్లో ఈమె తెలుగు సినిమా చేయక పోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది.