వైరల్ వీడియో: దిశాపటానీ 'జ్యూసీ' అందాలు
బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ తన అద్భుతమైన ఫిజిక్- బోల్డ్ ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
By: Sivaji Kontham | 5 April 2026 1:32 PM ISTబాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ తన అద్భుతమైన ఫిజిక్- బోల్డ్ ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల జరిగిన ఒక పాపులర్ ఫ్యాషన్ ఈవెంట్‌లో దిశా తన సరికొత్త లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దిశా ధరించిన బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నెటిజన్లను కట్టిపడేస్తోంది.
ఈ ఈవెంట్ కోసం దిశా పటానీ `జ్యూసీ` అనే థీమ్‌తో రూపొందించిన బ్లాక్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. ఈ డ్రెస్ లో పర్ఫెక్ట్ కర్వ్స్‌ను ఎలివేట్ చేస్తూ అత్యంత స్టైలిష్‌గా రిస్కీ బోల్డ్ డిజైన్ తో ఆకర్షిస్తోంది. నెటెడ్ ఫ్యాబ్రిక్- రివీలింగ్ కట్స్‌తో ఉన్న ఈ డ్రెస్సులో దిశా అందాల ఎలివేషన్ మరో లెవల్ లో ఉందనడంలో సందేహం లేదు. నెటిజన్లు ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్‌కు ఫిదా అవుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దిశా ఈ బ్లాక్ డ్రెస్సులో మరింత కాన్ఫిడెంట్ గా కనిపించింది.
ర్యాంప్‌పై దిశా పటానీ హొయలు పోయిన తీరు ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. దిశా అలా హొయలొలికిస్తూ నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ అటు వైపే.. దిశా తనదైన శైలిలో క్యాట్ వాక్ చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన పోజులు కుర్రకారు కంటికి కునుకు పట్టనీకుండా చేస్తున్నాయి. ఫ్యాషన్ ప్రియులు దిశా బాడీ లాంగ్వేజ్ ని దిశా స్టైలింగ్ ని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాలో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.
వరుస ఫోటోషూట్‌లతోనే కాకుండా క్రేజీ ప్రాజెక్టులలేవీ లేవు. దిశా పటానీని చివరిగా తెలుగు ఆడియెన్ కల్కి 2898 ఏడి, కంగువ చిత్రాలలో వీక్షించారు. మళ్లీ ఎప్పుడు ఈ భామ సౌత్ లో కనిపిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఫ్లాపుల కారణంగా.. అటు హిందీలో ఈ భామ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది.
మొత్తానికి సినిమా ఆఫర్లు ఏవీ లేకపోయినా, సోషల్ మీడియా గ్లామర్ షోలతో దిశా పటానీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. `జ్యూసీ` అందాలతో తాజా ఈవెంట్లో దిశా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్యాషన్ రంగాన్ని ఏల్తూనే సినిమా రంగంలో తన కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో ఉంది ఈ బ్యూటీ.
