Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌ : డార్క్‌ షేడ్‌లో 'కల్కి' బ్యూటీ అందాల షో

అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న హీరోయిన్స్‌ జాబితాలో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Ramesh Palla   |   14 Aug 2025 10:48 AM IST
ఫోటో టాక్‌ : డార్క్‌ షేడ్‌లో కల్కి బ్యూటీ అందాల షో
X

పదేళ్ల క్రితం తెలుగు సినిమా 'లోఫర్‌'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. మొదటి సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన లక్కీగా తర్వాతి ఏడాదిలోనే ఎంఎస్ ధోనీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో దిశా పటానీ పాత్ర పరిధి తక్కువగానే ఉంటుంది. అయినా కూడా సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా దిశా బిజీ అయింది. అప్పటి నుంచి వరుసగా ఏడాదికి కనీసం రెండు సినిమాల చొప్పున చేస్తూ వచ్చింది. గత రెండు మూడు సంవత్సరాలుగా బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా దిశా పటానీ దూసుకు పోతుంది. సోషల్‌ మీడియాలోనూ ఈమెకు మంచి క్రేజ్‌ ఉంది. అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న హీరోయిన్స్‌ జాబితాలో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీ జోరు

గత ఏడాదిలో దిశా పటానీ నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో యోధ హిందీ సినిమా కాగా, కల్కి 2898 ఏడీ, కంగువ సినిమాలు సౌత్‌ ఇండియన్ మూవీస్ అనే విషయం తెల్సిందే. కల్కి సూపర్‌ హిట్‌ అయినప్పటికీ ఆ సినిమాలో దిశా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఉన్నంతలో కాస్త పర్వాలేదు అనిపించింది. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా దిశా పటానీకి సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ పోతున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా ను ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపుగా 62 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఈ స్థాయిలో ఇన్‌స్టా ఫాలోయింగ్‌ కలిగి ఉన్న ఇండియన్‌ హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎంతో సీనియర్‌, స్టార్‌ హీరోయిన్స్‌ కి సైతం ఈ స్థాయి ఫాలోయింగ్‌ లేదని చెప్పాలి.

బ్లాక్‌ డ్రెస్‌లో బికినీ షో

ఈ స్థాయి ఫాలోయింగ్‌కి ఖచ్చితంగా అందాల ఆరబోత కారణం అనడంలో సందేహం లేదు. దిశా పటానీ అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయడం ద్వారా మంచి అందం ఈ అమ్మడి సొంతం అయింది. తాజాగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో దిశా పటానీ బికినీ ట్రీట్‌ చేసింది. డార్స్ షేడ్స్‌ లో దిశా పటానీ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూపు తిప్పనివ్వని ఈ అమ్మడి అందం కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం దిశా కే సాధ్యం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో దిశా పటానీ

డార్క్‌ షేడ్‌ స్కిన్‌ షో చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకోగలిగిన దిశా పటానీ చూపు తిప్పనివ్వలేదు. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్స్ లేకున్నా కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ముందు ముందు కూడా ఈ అమ్మడి జోరు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు స్టార్‌ హీరోల సినిమాల్లో దిశా పటానీ నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రభాస్‌ తో దిశా పటానీ సరైన రొమాంటిక్ సీన్స్ పడలేదు. ఒకవేళ మంచి సీన్స్ పడి ఉండి, కథ లో పార్ట్‌ అయ్యి ఉంటే ఖచ్చితంగా దిశా పటానీకి మంచి గుర్తింపు దక్కి ఉండేది. తద్వారా మరిన్ని పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చి ఉండేవి అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.