Begin typing your search above and press return to search.

28 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న డిస్కో శాంతి.. టీజర్ లో ఆకట్టుకున్న గెటప్!

సాధారణంగా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది.

By:  Ramesh Palla   |   9 Aug 2025 1:59 PM IST
28 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న డిస్కో శాంతి.. టీజర్ లో ఆకట్టుకున్న గెటప్!
X

సాధారణంగా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత అవకాశాలు లేక పెళ్లి చేసుకొని కొంతమంది దూరమైతే.. మరికొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ సినిమాల మీద ఆశతోనే రీ ఎంట్రీ ఇస్తూ అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే 1980 - 90 దశకంలో స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది డిస్కో శాంతి. రియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్న దివంగత నటుడు శ్రీహరి భార్యగా మరింత క్రేజ్ అందుకుంది.

శ్రీహరి మరణం తర్వాత ఇద్దరు కొడుకులతో ఇంటికే పరిమితమైన డిస్కో శాంతి.. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగు వేసుకోవడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ నటుడు రాఘవ లారెన్స్, తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్ తో కలిసి నటిస్తున్న చిత్రం బుల్లెట్. నిన్న ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ లో అనూహ్యంగా డిస్కో శాంతి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో ఆమె

జ్యోతిష్యురాలు గెటప్ లో కనిపించి ఆకట్టుకుంది. మొత్తానికైతే చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిస్కో శాంతి ..ఈ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఇక బుల్లెట్ సినిమా విషయానికి వస్తే.. ఇన్నాసి పాండియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కదిరేశన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 8న విడుదలైన టీజర్ ద్వారా డిస్కో శాంతి పాత్ర పై కొంత స్పష్టత లభించింది. "మన జీవితంలో జరిగే ప్రతి విషాదం.. గతంలో ఎక్కడో జరిగిందే" అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఈ టీజర్ ప్రేక్షకులను ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటుంది. సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి టీజర్ విడుదలవగా.. ఇందులో కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.."కొన్నిసార్లు సైన్స్ కంటే మించిన శక్తి అవసరం", "కాలం విశ్వాసానికి మించి శక్తివంతమైంది" ఇలా పలు డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమాలో వైశాలి రాజ్, సునీల్, అరవింద్ ఆకాష్ , కాళీ వెంకట్, రంగరాజు పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

డిస్కోశాంతి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో పీక్స్ లో ఉండగానే ప్రముఖ నటుడు శ్రీహరిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. భర్త , పిల్లలతోనే కెరియర్ కొనసాగించింది. కానీ అనూహ్యంగా శ్రీహరి మరణించడంతో ఆమె జీవితం మొత్తం తలకిందులైందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త మరణం సహజ మరణం కాదు అని, కావాలనే హత్య చేశారు అనే కోణంలో ఆరోపణలు కూడా వినిపించింది డిస్కో శాంతి. భర్త మరణం తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న ఈమె.. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.