1000 కోట్లు కొల్లగొట్టిన సృష్టికర్తలు వీళ్లే!
బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లు సాధించడం అన్నది అసాధారణ విషయం. బలమైన కథ, కథనాలతో పాటు స్టార్ ఇమేజ్ కూడా ఎంతో కీలకమైంది.
By: Srikanth Kontham | 10 Jan 2026 1:00 AM ISTబాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లు సాధించడం అన్నది అసాధారణ విషయం. బలమైన కథ, కథనాలతో పాటు స్టార్ ఇమేజ్ కూడా ఎంతో కీలకమైంది. మరి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్ల చిత్రాల సృష్టికర్తలు ఎంత మంది అంటే? ఎనిమిది మంది స్టార్ డైరెక్టర్లున్నారు. సౌత్ నుంచి ఐదురుగు దర్శకులు..నార్త్ నుంచి ముగ్గురు దర్శకులు కనిపిస్తునారు. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నితీష్ తివారీ తెరకెక్కించిన 'దంగల్' తొలిసారి బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను సాధించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
వీటిలో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి 600 కోట్లు రాబట్టగా మిగతా వసూళ్లు అన్ని చైనా సహా ఇతర దేశాల నుంచే ఉన్నాయి. ఆ తర్వాత రెండేళ్లకు 'బాహుబలి ది కన్ క్లూజన్' తో రాజమౌళి ఆ ఫీట్ ను సాధించాడు. సౌత్ నుంచి , తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మొట్ట మొదటి 1000 కోట్ల వసూళ్ల చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 1800 కోట్ల వసూళ్లను సాధించింది. 'బాహుబలి' ప్రాంచైజీ కలిపి చూస్తే 2500 కోట్లకుపైగానే వసూళ్లు సాధించింది. ఆ తర్వాత మరో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్ 2' పాన్ ఇండియాలో 1000 కోట్లు దాటిన తొలి కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది.
అనంతరం మరో తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898' పాన్ ఇండియాలో 1000 కోట్లు వసూళ్లు దాటిన రెండవ తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 1100 కోట్ల వసూళ్లను సాధించింది.
అటుపై సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప 2' 1000 కోట్ల క్లబ్ లో అత్యంత వేగంగా చేరిన చిత్రంగా రికార్డుకు ఎక్కింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 1800 కోట్ల వసూళ్లను సాధించింది. బాలీవుడ్ హీరోల రికార్డులను సైతం తుడిచిపెట్టిన చిత్రంగా నిలిచింది. అలాగౌ తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ కి వెళ్లి షారుక్ ఖాన్ తెరకెక్కించిన `జవాన్` కూడా 1000 కోట్ల వసూళ్ల చిత్రమే. లాంగ్ రన్ లో ఈ సినిమా 1100 కోట్ల వసూళ్ల సినిమాగా నిలిచింది.
అంతకు ముందు షారుక్ ఖాన్ తో సిద్దార్ద్ అనంద్ తెరెక్కించిన 'పఠాన్' కూడా 1000 కోట్ల వసూళ్ల చిత్రమే. షారుక్ ని తొలిసారి 1000 కోట్ల క్లబ్ లో చేర్చిన చిత్రమిదే. షారుక్ తర్వాత మరే స్టార్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఈ మధ్యనే రిలీజ్ అయిన 'ధురందర్' తో రణవీర్ సింగ్ 1000 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ నుంచి రెండవ హీరోగా నిలి చాడు. ఈ సినిమాను 'యూరి' ఫేం ఆదిత్య ధర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మార్చిలో 'ధురంధర్ 2' కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 2000 కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.
