తమిళ డైరెక్టర్స్ లో యాక్టర్ అవ్వాలనే కసి ఎక్కువగా ఉందా? మరి మన దర్శకులలో గొప్ప నటులు ఎవరు...
కొన్ని సంవత్సరాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
By: Gopi Velupala | 25 Sept 2026 4:00 AM ISTకొన్ని సంవత్సరాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోకపోయిన కూడా వాళ్లు ఎక్కడ తగ్గకుండా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే డిఫరెంట్ సినిమాలను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్ డైరెక్టర్లు సినిమాలను చేస్తూనే హీరోలుగా కూడా చేస్తు వాళ్ళ లక్కు ను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తమిళ డైరెక్టర్స్ చాలామంది నటులుగా మారి వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. సముద్ర ఖని, ఎస్ జే సూర్య లాంటి దర్శకులు నటులుగా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళ సత్తా చాటుతున్నారు. ఇక వీళ్ళ తర్వాత రీసెంట్ గా లోకేష్ కనకరాజు సైతం 'డిసి' మూవీతో హీరోగా మారాడు. దర్శకుడిగా తను చాలా బిజీగా ఉన్నప్పటికి అరుణ్ మతేశ్వరన్ చెప్పిన కథ తనకు బాగా నచ్చడంతో డిసి సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులందరిని విశేషంగా అలరించింది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి ఒక మంచి గుర్తింపైతే వచ్చింది... ఈ లెక్కన మన తెలుగు దర్శకులు కూడా హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో 'పెళ్లి చూపులు' సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాను చేశాడు. అప్పటినుంచి ఆయన డైరెక్షన్ చేస్తూనే నటుడిగా కూడా రానిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం ఒక సినిమాలో పలానా పాత్ర ఉందంటే చాలు దానికి తరుణ్ భాస్కర్ సెట్ అవుతాడనే రేంజ్ లో తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. తరుణ్ భాస్కర్ తో పాటు వెంకటేష్ మహా కూడా కొన్ని సినిమాల్లో నటించి తన సత్తా ఏంటో ప్రూవ్ చేశాడు. ఇక ఇప్పుడు మరికొంతమంది దర్శకులు సైతం నటులుగా మారుతున్నారు. ఇది ఒక రకంగా శుభ పరిణామమే అయినప్పటికి వాళ్ళు కేవలం నటులుగా కొనసాగితే చాలావరకు ఇబ్బంది కలగవచ్చు. వారిలో ఉన్న క్రియేటివిటీని వాడుతూ కొన్ని మంచి సినిమాలను చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్నాడు. అలాగే వెంకటేష్ మహా సైతం 'కేరాఫ్ కంచెరపాలెం' మూవీతో నేషనల్ అవార్డ్ ను దక్కించుకున్నాడు.
వీళ్ళు నటులుగా మారడం వల్ల వీళ్ల నుంచి రావాల్సిన సినిమాలు రాకుండా పోతాయి. కాబట్టి అటు నటన మీద ఆసక్తి చూపిస్తూనే డైరెక్షన్ కూడా చేస్తే బాగుంటుందనే ధోరణిలో కూడా మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు... తమిళ్ డైరెక్టర్లు అయిన ఎస్ జే సూర్య, సముద్ర ఖని డైరెక్షన్ చేయకుండా కంప్లీట్ నటన మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మన తెలుగు దర్శకులు నటులుగా మారినా కూడా సినిమాలు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడి నటులుగా ఎంట్రీ ఇస్తే మాత్రం వాళ్ళకంటూ ఒక సపరేట్ టైమింగ్ ను ఏర్పాటు చేసుకొని గొప్ప నటులుగా ఎదుగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...
