Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్స్ లైన్ బాగానే చెబుతున్నారు...కానీ బౌండెడ్ స్క్రిప్ట్ కి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారా..?

డైరెక్టర్ తన మైండ్ లో ముందుగానే సినిమా చూసుకొని దాన్ని ప్రేక్షకులకు ఎలా చూపించాలనే కోణంలో వర్క్ చేస్తుంటాడు. దర్శకుడి మైండ్ లో ఉండే ఆలోచనలకు విజువలైజేషన్ కి హద్దులుండవు.

By:  Gopi Velupala   |   8 Oct 2026 10:18 AM IST
స్టార్ డైరెక్టర్స్ లైన్ బాగానే చెబుతున్నారు...కానీ బౌండెడ్ స్క్రిప్ట్ కి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారా..?
X

డైరెక్టర్ తన మైండ్ లో ముందుగానే సినిమా చూసుకొని దాన్ని ప్రేక్షకులకు ఎలా చూపించాలనే కోణంలో వర్క్ చేస్తుంటాడు. దర్శకుడి మైండ్ లో ఉండే ఆలోచనలకు విజువలైజేషన్ కి హద్దులుండవు. కొందరు దర్శకులు స్టార్ హీరోలకు స్టోరీలను చెప్పే టైమ్ లో తడబడుతున్నారు. సింగిల్ లైన్ గా చెప్పేటప్పుడు చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అదే లైన్ ను రెండున్నర గంటల కథ గా మార్చి రాయడంలో మాత్రం విఫలమవుతున్నారు. అందుకే కొన్ని ప్రాజెక్ట్ లు ఆర్భాటంగా అనౌన్స్ మెంట్ అవుతున్నాయి మధ్యలోనే ఆగిపోతున్నాయి.

కథ విస్తరణ లో తేడా కొడుతుంది...

లైన్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది కాబట్టి పెద్దగా కష్టం లేకుండా సింపుల్ గా చెప్పేస్తున్నారు. కానీ విస్తరణ ప్రాసెస్ లో ఏ సీన్ ఎందుకు వచ్చింది. లాజిక్కులు కరెక్ట్ గా సెట్ అయ్యాయా? అవ్వకపోతే వాటిని ఎలా మార్చాలి. సీన్ కి సీన్ కి మధ్య ఫ్లో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందా? కోర్ ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అవుతున్నాయా? కామెడీ సీన్ తో ఆడియన్ ను ఎలా నవ్వించాలి అనే చాలా విషయాలను కులంకషంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సీన్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ లో కథ లో ఎక్కడ తేడా గా అనిపించిన డైరెక్టర్స్ స్టోరీ ని రాయకుండా ఆపేస్తారు. వీటన్నింటికి భయపడకుండా ధైర్యం చేసి తప్పో రైటో బౌండెడ్ స్క్రిప్ట్ రాసేసి, హీరోలకు కథలు చెప్పినప్పుడు వాళ్ళు అడిగే డౌట్స్ కి డైరెక్టర్ దగ్గర సమాధానం లేకపోతే హీరో ఆ కథను హోల్డ్ లో పెట్టేస్తాడు. అందుకే ఒక కాన్ఫ్లిక్ట్ రాస్తే దానికి ప్రేక్షకులందరు సరెండర్ అయిపోవాలి. దానిలోని కోర్ ఎమోషన్ ఆడియన్స్ కి బోర్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కుదిరనప్పుడే బౌండెడ్ స్క్రిప్ట్ హీరో కి నచ్చుతుంది. ఆయన అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం దొరుకుతుంది. ఈ ఎంటైర్ కథ విస్తరణ లో హీరో సన్నివేశాలు ఎంగేజింగ్ లేకపోతే తను ఆ స్టోరీని రిజెక్ట్ చేస్తాడు. ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడానికి వీటన్నింటిని దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కొందరు డైరెక్టర్స్ ఫుల్ స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు అనౌన్స్ మెంట్ వచ్చాక ఆగిపోతున్నాయి...

దీనికి సొల్యూషన్ ఏంటి?

డైరెక్టర్ కి లైన్ విషయంలో ఉన్న క్లారిటి కథను డెవలప్ చేసే ప్రాసెస్ లో రావడం లేదు. కాబట్టి ఎలాంటి ఈగోలకు పోకుండా సపరేట్ గా కొంతమంది రైటర్స్ తో కూర్చొని కథ చర్చలు జరపాలి. అలా అయితే ఫుల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు వచ్చే చాలా డౌట్లకి ఇక్కడే క్లారిటి దొరుకుతుంది. ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఉంటే బౌండెడ్ స్క్రిప్ట్ పరంగా హీరోను మెప్పించవచ్చు...