ఆ డైరెక్టర్ ని మాత్రం అలా చూడలేం!
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుంచి కూడా అలాంటి ప్రతిభావంతుడు ఒకరు నటుడు అవుతున్నాడనే ప్రచారం మొదలైంది. అతడు ఎవరో కాదు. హిట్ మెషిన్ అనీల్ రావిపూడి.
By: Srikanth Kontham | 4 Jan 2026 8:00 PM ISTఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్లు కూడా హీరోలగా తెరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్లగా సక్సెస్ అయిన కొన్నేళ్లకు నటన పై ఫ్యాషన్ తో కెప్టెన్ కుర్చీ దిగిపోయి మ్యాకప్ వేసుకుంటున్నారు. ఆ రకంగా సక్సెస్ అయిన వాళ్లు ఉన్నారు. రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ మొదలై అటుపై డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యాడు. అక్కడ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం హీరో కం డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు. కోరియోగ్రాఫర్ గానూ సేవలందిస్తున్నాడు. అంతకు ముందు కోలీవుడ్ లో ఎస్ .జె సూర్య డైరెక్టర్ గా ఎన్నో విజయాలు అందించాడు.
కానీ ఇప్పుడతడు దర్శకత్వం వదిలేసి నటుడిగా బిజీ అయ్యాడు. స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలతో అదర గొడుతున్నాడు. డైరెక్టర్ గా సంపాదించాల్సిందంతా ఒక సినిమాలో నటించి సంపాదిస్తున్నాడు. గౌతమ్ మీనన్ కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించాడు. ఇప్పుడతడు కూడా డైరెక్షన్ వదిలేసి నటుడయ్యాడు. స్టార్స్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మధ్యనే మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. `డీసీ` అనే సినిమాతో లాంచ్ అవుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయిదంటే? లోకేష్ కెప్టెన్ కుర్చీకి శాశ్వతంగా దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ప్రస్తుతం వీళ్లంతా ట్రెండింగ్ లో డైరెక్టర్ నటులు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుంచి కూడా అలాంటి ప్రతిభావంతుడు ఒకరు నటుడు అవుతున్నాడనే ప్రచారం మొదలైంది. అతడు ఎవరో కాదు. హిట్ మెషిన్ అనీల్ రావిపూడి. డైరెక్టర్ గా అతడి సక్సెస్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే అతడి ఎనర్జీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రచార కార్యక్రమాల్లో అనీల్ ఇన్వాల్వ్ మెంట్ చూస్తే? హీరో అవ్వాల్సిన అనీల్ డైరెక్టర్ అయ్యాడనిపిస్తుంది. కెమెరా వెనుకే కాదు కెమెరా ముందు కూడా నటించగలడు. నటన నేర్పడమే కాదు. అవసరమైతే తానే నటుడైపోతాడు. అంతటి ప్రతిభావంతుడు హీరో అయితే సంతోషమే కదా.
ఇదే విషయాన్ని అనీల్ ముందుకు తీసుకెళ్తే నటుడు అవ్వడానికి ఎంత మాత్రం అవకాశం లేదనేసాడు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగేవాడిని కాదన్నారు. ఒక వ్యక్తి తన క్రాఫ్ట్‌లో టాప్‌లో ఉన్నప్పుడు, దారి మళ్లించే ప్రలోభా లు వస్తాయన్నాడు. అలాంటి ట్రాప్‌లకు లొంగితే కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుందన్నాడు. అందుకే తనకు హీరోగా మారాలనే ఆలోచన ఏమాత్రం లేదని, ఇండస్ట్రీలో ఉన్నంత కాలం దర్శకుడిగానే సేవలందిస్తానన్నాడు.ఇది అనీల్ అభిమానులకు నిరాశే. అనీల్ కు ఇండస్ట్రీ సహా బయట ప్రత్యేకమైన అభిమానులున్న సంగతి తెలిసిందే.
