ఆ సంచలనం కూడా రాజీ పడిన రోజు!
తేజ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డైరెక్టర్. కొత్త నటీనటుల్ని పరిచయం చేసి స్టార్లగా తీర్చదిద్దడం ఆయన ప్రత్యేకత.
By: Srikanth Kontham | 7 Aug 2025 1:00 AM ISTతేజ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డైరెక్టర్. కొత్త నటీనటుల్ని పరిచయం చేసి స్టార్లగా తీర్చదిద్దడం ఆయన ప్రత్యేకత. ఆయన కాంపౌండ్ నుంచి ఎంతో మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వచ్చిన వారంతా తేజ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అలాగే ఆయనలో కోపిస్టిని కూడా అంతే హైలైట్ చేస్తుంటారు. సెట్ లో చెప్పింది చేయకపోతే కొడతారని...కేకలేస్తారని ఆరోపించిన వారు ఉన్నారు. తాను చెప్పిందే వేదంగా అంతా పని చేయాలని, ఎదురు చెప్పడానికి వీలు లేదని, ఎవ్వరూ మాట వినని జగ మొండిగా తేజ పేరు హైలైట్ అయింది.
ఆయన కూడా రాజీ పడే తత్వం గల వారు కాదని చాలా సందర్భాల్లోనూ బయటకు వచ్చింది. రెండున్నర దశాబ్దాల కెరీర్ లో తేజ తక్కువ సినిమాలు చేయడానికి ఇదీ ఓకారణమని అంటారు. అయితే తేజ కేవలం కొత్త వారితే మాత్రమే పనిచేస్తారు. స్టార్ హీరోలతో సినిమాలు చేయరన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే ఓ పేరున్న నటుడు మాత్రం తేజకు ఎదురు సమాధానం చెప్పిన నటుడిగా నిలిచాడు. ఈ విషయాన్ని తేజ స్వయం తెలిపారు. ఆ నటుడితో తేజ సినిమా చేస్తోన్న సమయంలో ఆరంభంలో డైరెక్టర్ చెప్పిందంతా బాగానే చేసాడుట.
సగం షూటింగ్ అయిన తర్వాత తేజని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసాడుట. డైరెక్టర్ చెప్పింది కాకుండా తనకు వచ్చింది చేసుకుంటూ వెళ్లాడుట. ఇలా ఓ రెండు సన్నివేశాల విషయంలో జరిగిందన్నారు తేజ. అంతా తనకే తెలుసన్నట్లు వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదన్నారు. కానీ ఆ రెండు సన్ని వేశాల విషయంలో తేజ మాత్రం ఆ నటుడి మాటకే కట్టుబడి పని చేసినట్లు తెలిపారు. ఆ నటుడు పేరు మాత్రం తేజ రివీల్ చేయలేదు.
జీవితంలో అంత వరకూ ఏ సినిమా విషయంలో అలాగ జరగలేదన్నారు. తాను చెప్పింది చేసిన నటులు తప్ప...నటులు చెప్పింది తాను విన్న సందర్భం అదొక్కటేనని తెలిపారు. తేజ సినిమాల సంగతి చూస్తే ర రెండేళ్లగా ఖాళీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. చివరిగా 2023లో 'అహింస' సినిమా చేసారు. ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కలేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
