Begin typing your search above and press return to search.

ఓజి2 పై అంచ‌నాలు పెంచేసిన సుజిత్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా సినిమా ఓజి. సెప్టెంబ‌ర్ 25న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Oct 2025 2:19 PM IST
ఓజి2 పై అంచ‌నాలు పెంచేసిన సుజిత్
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా సినిమా ఓజి. సెప్టెంబ‌ర్ 25న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తుంది. ఓజి రిలీజైన అన్ని ఏరియాలతో పాటూ యూఎస్ లో కూడా ఈ సినిమా భారీ స‌క్సెస్ ను అందుకుంది. సినిమా రిలీజైన త‌క్కువ కాలంలోనే ఓజి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు లాభాల్లోకి ఎంట‌రైంది.

ఓజి స‌క్సెస్ @డ‌ల్లాస్

ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఓజి క‌లెక్ష‌న్లు 6 మిలియ‌న్ డాల‌ర్లకు చేరువ‌లో ఉన్నాయి. అయితే ఓజి సినిమాకు యూఎస్ లో వ‌చ్చిన ఆద‌ర‌ణ‌ను గుర్తించిన మేక‌ర్స్, ఈ స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డంలో భాగంగా చిత్ర డైరెక్ట‌ర్ సుజిత్ మ‌రియు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అమెరికాలోని డ‌ల్లాస్ కు వెళ్లి అక్క‌డ ఫ్యాన్స్ తో క‌లిసి సినిమా చూడట‌మే కాకుండా మూవీ స్క్రీనింగ్ త‌ర్వాత ఫ్యాన్స్ తో ముచ్చ‌టించారు.

గ్రాండ్ గా స్వాగ‌తించిన ఫ్యాన్స్

ప‌వ‌న్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన సుజిత్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి ఆద‌ర‌ణ ద‌క్కిందో డ‌ల్లాస్ లో కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ అత‌న్ని అంతే గ్రాండ్ గా వెల్‌క‌మ్ చేయ‌డం చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అమెరికాలో ప‌వ‌న్ ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి తాను చాలా థ్రిల్ అయ్యాన‌ని చెప్పిన సుజిత్, సినిమా రిలీజైన నెక్ట్స్ డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ఫోన్ చేశార‌ని, మూవీ రిలీజ్ త‌ర్వాత ప‌వ‌న్ త‌న‌ను కౌగిలించుకున్నార‌ని, ఆ మెమొరీ త‌న లైఫ్ లో స్పెష‌ల్ గా నిలిచిపోతుంద‌ని చెప్పారు.

ఓజి పార్ట్1 ట్ర‌య‌ల్ బాల్ మాత్ర‌మే

సినిమా థియేట‌ర్ల‌లో ఎన్ని రోజులు ఆడుతుంద‌నే దానికంటే ఆడియ‌న్స్ కు మంచ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డం పైనే తాను ఎక్కువ‌గా దృష్టి పెడ‌తాన‌ని చెప్పిన సుజిత్, ఓజి సినిమాకు యూఎస్ లో 10వ రోజు కూడా ఈ రేంజ్ ర‌న్ ఉండ‌టం చాలా బావుంద‌ని, త‌ర్వాతి సినిమా రిలీజ్ కు తాను అక్క‌డే ఉంటాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఓజి పార్ట్1 కేవ‌లం ట్ర‌య‌ల్ బాల్ అని, నెక్ట్స్ పార్ట్ మ‌రింత భారీగా, గ్రాండ్ గా ఉండ‌బోతుంద‌ని కూడా సుజిత్ వెల్ల‌డించారు. ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించ‌గా, ఓజి మూవీని ప్ర‌త్యంగిర సినిమాస్ యూఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసింది.