Begin typing your search above and press return to search.

రవితేజ కాదు ఆ ప్రాజెక్ట్ కు ముందు నాగచైతన్యను ఓకే చేశారు

నిన్ను కోరి, మజిలీ , టక్ జగదీష్, ఖుషి లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించాడు డైరెక్టర్ శివ నిర్వాణ.

By:  M Prashanth   |   19 Aug 2025 12:00 AM IST
రవితేజ కాదు ఆ ప్రాజెక్ట్ కు ముందు నాగచైతన్యను ఓకే చేశారు
X

నిన్ను కోరి, మజిలీ , టక్ జగదీష్, ఖుషి లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఇప్పుడు ఆయన మాస్ మహారజ రవితేజతో తన తదుపరి సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించనున్నట్లు టాక్.

దర్శకుడు శిన నిర్మాణ ఎప్పటిలాగా కాకుండా ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయనకు టచ్ ఉన్న ఎమోషనల్ ప్రాధాన్యం ఇచ్చే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు కాకుండా కొత్తగా యాక్షన్ే కథ రాసుకున్నారని తెలుస్తోంది. అటు మాస్ మహారాజ రవితేజ కూడా రెండు దశాబ్దాలుగా మాస్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే ఈ సినిమా రవితేజ కంటే ముందు అక్కినేని నాగచైతన్య అనుకున్నారట. స్క్రిప్ట్ ఆయనకు ఫైనలైజ్ చేశారు. నాగచైతన్య #NC25 ప్రాజెక్ట్ గా దీన్ని తెరకెక్కించాలని ప్లాన్. ఇది ఎమోషనల్ యాక్షన్ డ్రామ్ విత్ ఫీల్ గుడ్ టచ్ లాగా ఉంటుందని, దర్శకుడు శివ అ కథపైనే పని చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఏడాది చివర్లో కల్లా సినిమా సెట్స్ పైకి కూడా వెళ్తుందని అన్నారు.

కానీ, ఏం జరిగిందో తెలియదు. ఈ స్టోరీ మళ్లీ రవితేజకు వెళ్లింది. ఇందులో రవితేజ ఫ్యామిలీ ఎమోషన్‌ తో కూడిన తండ్రి క్యారెక్టర్‌ ను రవితేజ పోషించనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజకు కూడా సాలిడ్ హిట్ అవసరం. కొన్ని రోజులుగా ఆయన ఎంచుకున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. డ్యాన్స్, కామెడీ, యాక్షన్ మిక్స్‌ కు బ్రాండ్ గా ఉండే ఆయన.. ఇటీవల పాత్రల ఎంపికలో కాస్త తడబడుతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ పాత్ర అయినా మాస్ మహారాజకు బ్రేక్ ఇస్తుందా చూడాలి!

ఇక ప్రస్తుతం రవితేజా మాస్ జాతర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశలో ఉంది. ఇదే నెల వినాయక చవితి సందర్భంగా 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, నాగచైతన్య- కార్తిక్ దండుతో సినిమా చేస్తున్నారు. ఇది NC 24 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది.