శంకర్ మళ్లీ రిస్కే చేస్తున్నారా?
ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ పై క్లారిటీ లేకపోవడం, లైకా సంస్థతో వివాదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం శంకర్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.
By: M Prashanth | 28 May 2026 7:00 PM ISTఒకప్పుడు భారీ విజువల్స్, సోషల్ మెసేజెస్, టెక్నికల్ గ్రాండియర్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్.. ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాపులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి మూవీలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆయన.. రోబో తర్వాత మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయారు. దీంతో ప్రస్తుతం శంకర్ కెరీర్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఇండియన్ 2 రిలీజ్ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ ఎఫెక్ట్ ఇండియన్ 3పై పడిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ పై క్లారిటీ లేకపోవడం, లైకా సంస్థతో వివాదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం శంకర్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.
ఇక గేమ్ ఛేంజర్ విషయంలో కూడా శంకర్ పై విమర్శలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రాన్ని ఒకవైపు చేస్తూనే మరోవైపు ఇండియన్ 2 పనులు నిర్వహించడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైందని కామెంట్స్ వినిపించాయి. భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో శంకర్ మార్కెట్ పై ప్రశ్నలు మొదలయ్యాయి.
ముఖ్యంగా నిర్మాతలకు భారీ బడ్జెట్ లతో రిస్క్‌గా మారుతున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న వేల్పరిపై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నవల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కనున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. బ్యాక్ గ్రౌండ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే టాక్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం సరైన నిర్ణయమా అంటూ చర్చ సాగుతోంది.
ప్రస్తుతం శంకర్ భారీ బడ్జెట్ ల కన్నా కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే మిడ్ రేంజ్ సినిమాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అనేక మంది సినీ ప్రియులు చెబుతున్నారు. ఒక స్ట్రాంగ్ స్టోరీతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వస్తేనే నిర్మాతలు, స్టార్ హీరోలు మళ్లీ పూర్తి నమ్మకం ఉంచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత వేల్పరి వంటి డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడితే బెటర్ అని సూచనలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం శంకర్ కు హీరో దొరుకుతారా? నిర్మాత ముందుకు వస్తారా? అన్నది కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే, రీసెంట్ గా కోలీవుడ్ లో మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో శంకర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఆ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే శంకర్ ను సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు శంకర్ తీసుకునే తదుపరి నిర్ణయం.. ఆయన కెరీర్ ను డిసైడ్ చేయనుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
