Begin typing your search above and press return to search.

మారుతి మారిపోయారు.. అందుకే ఇప్పుడు సలహాలు, సూచనలు!

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజా సాబ్ మూవీతో బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   15 Sept 2025 10:28 AM IST
మారుతి మారిపోయారు.. అందుకే ఇప్పుడు సలహాలు, సూచనలు!
X

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజా సాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పుడు శరవేగంగా మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు.

అదే సమయంలో మారుతి టీమ్ ప్రొడక్ట్స్ బ్యానర్ తో వివిధ సినిమాలను సమర్పిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న బ్యూటీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్ ను రప్పించడానికి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరుగుతుంది.. కల్చర్ ఎటు వెళ్తుందని బహిరంగంగా ప్రశ్నించారు. ప్రమోషన్స్ లో చాలా మంది వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. కొందరు సినిమా విఫలమైతే చొక్కా తీసేస్తా అంటున్నారు.. మరికొందరు సినిమాలు చేయనుంటున్నారు.. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు.. ఒక మూవీ కాకపోతే మరొకటి ఆడుతుందని అని మారుతి తెలిపారు.

అంతే కాదు తాను డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేస్తే, తనను ఎవరూ మించలేరని చెప్పారు. కానీ తానిప్పుడూ ఆ జోన్ లో లేనని, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు తీసుకురావాలని సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మారుతి చెప్పిన మాటల్లో నిజమే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకు బూతు డైరెక్టర్ గా ముద్ర పడింది.

ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాల్లో ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. కానీ ఆ తర్వాత జోనర్ నుంచి పూర్తిగా దూరమైన మారుతి, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ మూవీలను తెరకెక్కించారు. ఇప్పుడు కామెడీ హారర్ జోనర్ లో భారీ బడ్జెట్ తో రాజా సాబ్ రూపొందిస్తున్నారు.

మొత్తానికి ఇప్పుడు మారుతి చాలా మారిపోయారని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించేలా సినిమాలు మాత్రమే తీస్తున్నారు. అందుకే ఇప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తన కెరీర్‌ ను ఉదాహరణగా తీసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి అనవసరమైన పనులు చేయవద్దని కోరుతున్నారు.