Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి ఒంటి గంట వరకు రామ్.. ఫ్యాన్స్ కోసం ఏం చేశాడంటే!

అయితే అక్కడితో కథ అయిపోలేదు. షూటింగ్ గ్యాప్ లో లేదా ప్యాకప్ చెప్పాక హీరోలు వెళ్లిపోవడం సహజం.

By:  M Prashanth   |   25 Nov 2025 10:06 AM IST
అర్ధరాత్రి ఒంటి గంట వరకు రామ్.. ఫ్యాన్స్ కోసం ఏం చేశాడంటే!
X

సాధారణంగా స్టార్ హీరోల షూటింగ్ అంటే జనం ఎగబడటం కామన్. హీరోలు కూడా ఏదో అలా చేయి ఊపి, కారెక్కి వెళ్లిపోతుంటారు. కానీ ఉస్తాద్ రామ్ పోతినేని మాత్రం అలా కాదు. తన కోసం వచ్చిన అభిమానుల విషయంలో ఆయన తీసుకున్న కేర్, చూపించిన ఓపికను చూసి చిత్ర యూనిట్టే ఆశ్చర్యపోయిందట. రీసెంట్ గా ఒక షూటింగ్ స్పాట్ లో జరిగిన సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. టైటిల్ లోనే మాస్ వైబ్స్ ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఇది ఫ్యాన్స్ చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక మూమెంట్ గురించి దర్శకుడు మహేశ్ బాబు పి తాజాగా బయటపెట్టారు. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా రామ్ తన ఫ్యాన్స్ కు ఎంత విలువిస్తారో ఈ ఘటన రుజువు చేస్తోంది.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో అక్కడికి అభిమానులు పోటెత్తేవారట. ఆ జనసందోహాన్ని చూసి దర్శకుడు మహేశ్ బాబు కూడా షాక్ అయ్యారట. అంతమంది జనం ఉన్నారంటే, అక్కడ పక్కన ఇంకేదైనా వేరే సినిమా షూటింగ్ జరుగుతుందేమో అని ఆయన పొరబడ్డారట. కానీ ఆ జనం అంతా కేవలం రామ్ ను చూడటానికే వచ్చారని తెలిసి అవాక్కయ్యారట.

అయితే అక్కడితో కథ అయిపోలేదు. షూటింగ్ గ్యాప్ లో లేదా ప్యాకప్ చెప్పాక హీరోలు వెళ్లిపోవడం సహజం. కానీ రామ్ మాత్రం రాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండిపోయారట. వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి ఓపికగా ఫోటోలు ఇచ్చారట. అంత రాత్రి అవుతున్నా, అలసిపోయినా సరే.. చివరి అభిమానిని కూడా నిరాశపరచకూడదని రామ్ తీసుకున్న నిర్ణయం చూసి డైరెక్టర్ ఫిదా అయిపోయారు.

రామ్ గారికి అభిమానులు అంటే ప్రాణం అని, వారి గురించి ఆయన ఎప్పుడూ గొప్పగా మాట్లాడుతుంటారని డైరెక్టర్ తెలిపారు. అసలు రామ్ ఈ సినిమాను ఒప్పుకోవడానికి ప్రధాన కారణమే ఆయన అభిమానులట. ఫ్యాన్స్ పై ఆయనకు ఉన్న ప్రేమను తెరమీద చూపించే ప్రయత్నమే ఈ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని అర్థమవుతోంది.

మొత్తానికి షూటింగ్ స్పాట్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు నిలబడ్డ రామ్ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ రియల్ లైఫ్ సీన్ చూస్తుంటే, సినిమాలో ఎమోషన్ ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందో ఊహించుకోవచ్చు. నిజంగానే ఆయన ఫ్యాన్స్ గుండెల్లో 'కింగ్' అనిపించుకున్నారు.