అందుకే ఆ క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశా
రీసెంట్ గా ఓ సందర్భంలో డైరెక్టర్ కీర్తీశ్వరన్ మాట్లాడుతూ డ్యూడ్ మూవీలో మమిత చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 1:00 PM ISTకొన్ని సినిమాలు హిట్టైనా, వాటిలో ఉండే పాత్రలు, డైరెక్టర్ ఆ పాత్రల్ని డిజైన్ చేసిన తీరుకి ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్సే వస్తుంది. అయితే డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ను డిజైన్ చేసేటప్పుడు ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తారు. సినిమా రిలీజ్ తర్వాత ఆ క్యారెక్టర్ వల్ల సినిమాకు ఎలాంటి నష్టం జరగకూడదని అనుకునే ఏ డైరెక్టర్ అయినా క్యారెక్టర్లను రాసుకుంటారు. తాను కూడా అదే చేశానంటున్నారు డ్యూడ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్.
వరుసగా మూడు సార్లు రూ.100 కోట్ల మార్క్
గత వారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజైతే అందులో డ్యూడ్ మూవీ విన్నర్ గా నిలిచింది. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ లో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లను దాటింది. ఈ మూవీతో ప్రదీప్ వరుసగా మూడు సార్లు రూ.100 కోట్ల మార్క్ ను అందుకున్నట్టు అయింది.
మమిత పాత్రను విబేధిస్తున్న ఆడియన్స్
రీసెంట్ గా ఓ సందర్భంలో డైరెక్టర్ కీర్తీశ్వరన్ మాట్లాడుతూ డ్యూడ్ మూవీలో మమిత చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. మూవీలో మమిత కుంధన అనే పాత్రలో కనిపించగా, ఆ క్యారెక్టర్ ను ఆడియన్స్ విబేధిస్తున్నారనేది నిజమేనని చెప్పారు. అయితే తాను ఆ క్యారెక్టర్ ను ఎందుకలా డిజైన్ చేయాల్సి వచ్చిందో కూడా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
ఐడియల్ గర్ల్ గా చూపించాలనుకోలేదు
డ్యూడ్ లో తాను మమిత క్యారెక్టర్ ను రాస్తున్నప్పుడు తాను ఆమెను ఒక ఆదర్శవంతమైన అమ్మాయిగా చూపించాలనుకోలేదని, అలా అని ఆమెను నెగిటివ్ యాంగిల్ లో చూపించాలని కూడా అనుకోలేదని, బయట ప్రపంచంలో మనం రెగ్యులర్ గా కలిసే అమ్మాయిల లాగానే చూపించాలనుకున్నానని, అలా కాకుండా మమితను ఓ ఐడియల్ గర్ల్ గా చూపిస్తే రియలిస్టిక్ గా అనిపించదనే కారణంతోనే, ఆ క్యారెక్టర్ ను చాలా సహజంగా ఉండేలా.. కొంచెం స్వీట్ గా, కేరింగ్ గా, సానుభూతితో ఉంటూనే కొంచెం డేంజరస్ గా ఉండేలా డిజైన్ చేసినట్టు చెప్పారు.
సినిమాలో మిగిలిన పాత్రలు ఎలా ఉన్నా హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు రియలిస్టిక్ గా ఉండటం ముఖ్యమని భావించే తాను మమిత క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశానని కీర్తీశ్వరన్ చెప్పారు. ఆయన మాటలు విన్నాక అందరూ అతని ముందుచూపుని మెచ్చుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
