వాలెంటైన్స్ డే స్పెషల్: డైరెక్టర్ బాబీ రియల్ లైఫ్ మాస్ లవ్ స్టోరీ!
గతేడాది కోర్ట్ సినిమాతో వెండితెరపై మెరిసిన హిట్ జోడీ రోషన్ - శ్రీదేవి, ఇప్పుడు బ్యాండు మేళం తో మన ముందుకు రాబోతున్నారు.
By: Madhu Reddy | 15 Feb 2026 12:30 AM ISTగతేడాది కోర్ట్ సినిమాతో వెండితెరపై మెరిసిన హిట్ జోడీ రోషన్ - శ్రీదేవి, ఇప్పుడు బ్యాండు మేళం తో మన ముందుకు రాబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎమోషనల్ గ్లింప్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ వేడుకలో సినిమా కన్నా దర్శకుడు బాబీ తన లవ్ స్టోరీ గురించి చెప్పిన ఫన్నీ ఆన్సర్ హైలైట్‌గా నిలిచింది. ఒకవైపు సినిమాల సందడి, మరోవైపు స్టార్ దర్శకుల సరదా ముచ్చట్లతో ఈ వాలంటైన్స్ డే మరింత కలర్‌ఫుల్‌గా మారింది. వివరాలలోకి వెళితే ..
బ్యాండు మేళం గ్లింప్స్:
శ్రీదేవి, రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న 'బ్యాండు మేళం' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఆంధ్ర నేపథ్య కథతో మెప్పించిన ఈ జంట, ఈసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మనల్ని అలరించబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో హీరో బ్రేకప్ పెయిన్‌తో బాధపడుతున్న దృశ్యాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ సినిమాతో ఈ హిట్ జోడీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
డైరెక్టర్ బాబీ ఫన్నీ కామెంట్స్:
ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన స్టార్ డైరెక్టర్ బాబీ యాంకర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చి నవ్వులు పూయించారు. నా మొదటి లవ్ మా అమ్మ తరువాత ఆ అమ్మయిని పెళ్లిచేసుకున్న అని తన లవ్ స్టోరీని బయటపెట్టారు. ఎలా పడేసారు మీ ఆవిడను అని అడగ్గా 'నేను బైక్‌పై బాగా యాక్సిలేటర్ ఇచ్చి, గట్టిగా హార్న్ కొట్టి నా భార్యను లవ్‌లో పడేశాను' అని ఆయన చెప్పడంతో ఆడిటోరియం అంతా కేరింతలతో నిండిపోయింది. ప్రస్తుతం బాబీ అగ్ర హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా వున్నారు, ఇక ఇలాంటి సరదా మాటలతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టి ఫాన్స్ ను ఆశ్చర్యపరిచారు.
డైరెక్టర్ బాబీ తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు. పవర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన, జై లవ కుశ లో ఎన్టీఆర్‌ను మూడు విభిన్న పాత్రల్లో చూపించి మెప్పించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన వాల్తేరు వీరయ్య, అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి బాబీని టాప్ లీగ్‌లోకి చేర్చింది.ఇక హీరో ఎవరైనా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తూ, వారి మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేయడంలో బాబీ దిట్ట అని ఈ సినిమాలే నిరూపిస్తున్నాయి. ఇక శ్రీదేవి, రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న బ్యాండు మేళం సినిమాతో ఈ హిట్ జోడీ వరుసగా రెండో విజయాన్ని అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
